ఇండియన్ నేవీ.. 95 ఫైర్‌మ్యాన్ (గ్రూప్ సీ-నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్, నాన్ ఇండస్ట్రియల్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు వెస్టర్న్ నేవల్ కమాండ్ (ముంబయి) పరిధిలోని యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది. అయితే అవసరం మేరకు దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి రావొచ్చు.

 Image result for indian navy recruitment 2018

ఖాళీల వివరాలు:  95  (ఎస్సీ-14, ఎస్టీ-7, ఓబీసీ-26, జనరల్-48).

వయసు: ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నాటికి 18-25 ఏళ్లు. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడబ్ల్యూడీ (యూఆర్-పదేళ్లు; ఓబీసీ-13 ఏళ్లు; ఎస్సీ/ఎస్టీ-15 ఏళ్లు)లకు సడలింపు ఉంటుంది.

అర్హతలు: మెట్రిక్యులేషన్/తత్సమాన.

శారీరక ప్రమాణాలు: ఎత్తు-165 సెం.మీ.; ఛాతీ-81.5 సెం.మీ. (85 సెం.మీ.); బరువు-కనీసం 50 కిలోలు.

ఎంపిక విధానం: దరఖాస్తుల నుంచి అకడమిక్ మెరిట్ ఆధారంగా 1:200 నిష్పత్తిలో అభ్యర్థులను రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ అవేర్‌నెస్ ఆన్ ఫైర్ ఫైటింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 20 మార్కులు కేటాయించారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ (ఫైర్ ఫైటింగ్)లో నాలెడ్జ్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్; ఆపరేషనల్ యూజ్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్‌మెంట్స్; లైఫ్ సేవింగ్ డ్రిల్స్; కాజెస్ ఆఫ్ ఫైర్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

రాత పరీక్షలో సాధించిన మార్కుల ప్రకారం 1:10 నిష్పత్తిలో అభ్యర్థులను ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఈటీ)కి పిలుస్తారు. ఇందులో అర్హత సాధించిన వారు రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా జాబితా రూపొందిస్తారు. తర్వాత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన (ఏప్రిల్ 28-మే 4) వెలువడినప్పటి నుంచి 21 రోజుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలు వెబ్‌సైట్లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.bhartiseva.comwww.indiannavy.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి: