భారత హోమ్
మంత్రిత్వశాఖ పరిధిలో ఉండే వివిధ రక్షణ దళ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 496 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ తాజా నోటిఫికేషన్
లో భాగంగా అర్హులైన పురుష, మహిళ అభ్యర్ధుల నుంచీ దరఖాస్తులు కోరుతోంది. పూర్తి
వివరాలలోకి వెళ్తే..
విభాగాల వారీ ఖాళీలు:
సూపర్ స్పెషలిస్ట్ మెడికల్
ఆఫీసర్లు (సెకండ్-ఇన్-కమాండ్): - 4
విభాగాల వారీ ఖాళీలు: న్యూరాలజీ-1, నెఫ్రాలజీ-1, గ్యాస్ట్రో ఎంటరాలజీ-1, న్యూరో సర్జరీ-1.
అర్హత: గుర్తింపు పొందిన
యూనివర్సిటీ/సంస్థ నుంచి ఎంబీబీఎస్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. తప్పనిసరి
రొటేటరీ ఇంటర్న్‌షిప్ చేసుండాలి. వీటితో పాటు సంబంధిత విభాగంలో పీజీ డిగీ/డిప్లొమా
ఉత్తీర్ణత అవసరం.
వయసు: గరిష్ట వయో పరిమితి 50 ఏళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు సడలింపు ఉంటుంది.
స్పెషలిస్ట్ మెడికల్
ఆఫీసర్లు (డిప్యూటీ కమాండెంట్) : — 175.
విభాగాల వారీ ఖాళీలు:బీఎస్ఎఫ్-56, సీఆర్పీఎఫ్-85, ఎస్ఎస్బీ-19, ఐటీబీపీ-9, అస్సాం రైఫిల్స్-6.
అర్హత: అల్లోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్‌లో నిర్దిష్ట మెడికల్
క్వాలిఫికేషన్‌తో పాటు ఏదైనా స్టేట్ మెడికల్ కౌన్సిల్/ఎంసీఐలో శాశ్వత
రిజిస్ట్రేషన్, రొటేటరీ ఇంటర్న్‌షిప్ పూర్తిచేసుండాలి. సంబంధిత విభాగంలో
పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత; పీజీ డిగ్రీ చేసిన వారికి ఏడాదిన్నర, పీజీ డిప్లొమా పూర్తిచేసిన
వారికి రెండున్నరేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: గరిష్ట వయో పరిమితి 40 ఏళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు సడలింపు ఉంటుంది.
మెడికల్ ఆఫీసర్లు
(అసిస్టెంట్ కమాండెంట్): - 317.
విభాగాల వారీ ఖాళీలు: బీఎస్ఎఫ్-102, సీఆర్పీఎఫ్-21,
ఎస్ఎస్బీ-59, ఐటీబీపీ-107, అస్సాం రైఫిల్స్-28.
అర్హత: అల్లోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్‌లో నిర్దిష్ట మెడికల్
క్వాలిఫికేషన్‌తో పాటు ఏదైనా స్టేట్ మెడికల్ కౌన్సిల్/ఎంసీఐలో శాశ్వత
రిజిస్ట్రేషన్, రోటేటరీ ఇంటర్న్‌షిప్ పూర్తిచేసుండాలి.
వయసు: గరిష్ట వయో పరిమితి 30 ఏళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు సడలింపు
ఉంటుంది.
ఎంపిక: అకడమిక్
ప్రతిభ, పర్సనాలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక
చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ
కేటగిరీ పురుష అభ్యర్థులకు రూ.400; ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఉచితం.
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 2, 2019.
దరఖాస్తుకు చివరితేదీ: మే 1, 2019.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.recruitment.itbpolice.nic.in