దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్ర పభుత్వ విభాగాలలో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వ్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వివిధ కార్యాలయాలలో నాన్ టెక్నికల్, గ్రూప్-సి, పోస్టులను భర్తీ చేయనున్నారు అయితే . ఖాళీలు ఎన్ని ఉన్నాయనే వివరాలని త్వరలో వెల్లడించనున్నారు.

 Education News

అర్హత: పోస్టులను బట్టి పదోతరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత. 

వయసు: కొన్ని పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. మరికొన్ని పోస్టులకు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఎస్‌ఎస్‌సీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.100; ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఉచితం. ఎంపిక

విధానం: పేపర్-1 (ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్), పేపర్-2 (డిస్క్రిప్టివ్ టెస్ట్) ద్వారా ఎంపిక చేస్తారు. పేపర్-1 పరీక్షలో ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు (100 ప్రశ్నలు, 100 మార్కులు) ఉంటుంది. ఇందులో జనరల్ ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. పేపర్-2లో ఇంగ్లిష్ లేదా అభ్యర్థి ఎంచుకున్న భాషలో షార్ట్ ఎస్సే/ఇంగ్లిష్ లెటర్ రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 30 నిమిషాలు. పేపర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే పేపర్-2 రాయడానికి అర్హులు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు చివరితేదీ: మే 29, 2019.

పేపర్-1 పరీక్ష తేదీ: 2019, ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 6 వరకు.

పేపర్-2 పరీక్ష తేదీ: నవంబర్ 17, 2019

పూర్తి వివరాలకు వెబ్‌సైట్:   https://ssc.nic.in

 


మరింత సమాచారం తెలుసుకోండి: