చదువు ఉన్నా ఆర్ధికంగా వెనుకబడిన కుటుంభాలు భారత్ లో అనేకం ఉన్నాయి. అలాంటి కుటుంభాలలో పిల్లలు చాలా మంది చదువుకు దూరంగా ఉంటూ చిన్న చిన్న పనులకి వెళ్తూ భవిష్యత్తు అంధకారం చేసుకుంటున్న సంఘటనలు రోజూ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటి పరిస్థితి నుంచీ బయటపడటానికి, ఎంతో కొంత సాయం చేయాలనే తపనతో ఎన్నో ప్రోశ్చాహక సంస్థలు స్కాలర్‌షిప్ అందిస్తూ సాయం చేస్తూనే ఉన్నాయి.

 Image result for ntse scholarship

ఎన్‌టీఎస్‌ఈ  (నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్) కూడా ఈకోవకి చెందినదే. విద్యార్ధులు చదివే అనేక కోర్సులకి సంభందించి ప్రోశ్చాహం అందించాలని ఆర్ధక తోడ్పాటు వారి టాలెంట్ కి తప్పకుండా అవసరమని గ్రహించి  స్కాలర్‌షిప్ లని అందిస్తున్నాయి. అయితే ఎన్‌టీఎస్‌ఈలో అత్యుత్తమ ప్రతిభ చూపించిన వారికి స్కాలర్‌షిప్ లభిస్తుంది.

 పరీక్ష విధానం: 

ఎన్‌టీఎస్‌ఈ పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. స్టేజ్-1, స్టేజ్-2.
స్టేజ్-1 పరీక్ష:

ఈ విధానాన్ని రాష్ట్రాల స్థాయిలో ఆయా రాష్ట్రాలు నిర్వహిస్తాయి. అయితే ఇందులో రెండు విభాగాలు ఉంటాయి.

పార్ట్-1 - మెంటల్ ఎబిలిటీ టెస్ట్,

పార్ట్-2 స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్.

స్టేజ్-2 పరీక్ష: 

ఇది జాతీయస్థాయిలో జరిగే పరీక్ష. స్టేజ్-1లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎన్‌సీఈఆర్‌టీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది.
అర్హత

పదోతరగతి చదువుతున్న విద్యార్థులు ఎన్‌టీఎస్‌ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరితేదీలను ఆయా రాష్ట్రాలు ప్రకటిస్తాయి.

స్కాలర్‌షిప్

పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా జాతీయస్థాయిలో 2000 మందిని ఎంపికచేసి నేషనల్ టాలెంట్ సెర్చ్ నిబంధనల ప్రకారం 11, 12 తరగతుల విద్యార్థులకు నెలకు రూ.1200; యూజీ, పీజీ స్థాయి కోర్సు విద్యార్థులకు నెలకు రూ.2 వేలు అందిస్తారు.
ముఖ్యమైన పరీక్ష తేదీలు: 
స్టేజ్ 1 పరీక్ష: నవంబర్ 17, 2019
స్టేజ్ 2 పరీక్ష: మే 10, 2019 
మరిన్ని వివరాలకోసం వెబ్‌సైట్:  www.ncert.nic.in  


మరింత సమాచారం తెలుసుకోండి: