రిజర్వేషన్లు.. ఇండియాలో ఇది ఎప్పుడూ హాట్ టాపిక్కే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా ఇంకా రిజర్వేషన్లు ఏంటి అనే వారు కొందరైతే.. 70 ఏళ్లు దాటినా ఇంకా రిజర్వేషన్ల అవసరం ఉండటం దారుణం అనేవారు కొందరు. ఆ మాత్రం రిజర్వేషన్లు కూడా లేకపోతే.. బడుగు, బలహీన వర్గాలు ఈ మాత్రం కూడా అభివృద్ధి చెంది ఉండేవి కావంటారు మరికొందరు.


ఐతే.. అధికార బీజేపీకి మాతృసంస్థ ఆర్ఎస్‌ఎస్ కొంతకాలంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గళం వినిపిస్తోంది. ఈ సంస్థ మాటలు చూస్తే.. కొంపదీసి మోడీ సర్కారు రిజర్వేషన్లు ఎత్తేస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ.. ఇప్పుడు ఆ ఆర్ఎస్ ఎస్ మరోసారి స్టాండ్ మార్చేసింది.


రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఆర్ఎస్ఎస్ తెరదించింది. రిజర్వేషన్లకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో సామాజిక, ఆర్థిక అంతరాలు ఇంకా కొనసాగుతున్నందున రిజర్వేషన్లు ఉండాలని తాజాగా అభిప్రాయపడింది.


అంతే కాదు.. ఏకంగా లబ్ధిదారులు అవసరం అనుకున్నంత కాలం రిజర్వేషన్లను అమలు చేయాలంటూ సంచలనాత్మక ప్రకటన వెలువరించింది. రాజస్థాన్ లోని పుష్కర్ లో ఆర్ఎస్ఎస్ సమావేశంలో సంయుక్త ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ ఈ మేరకు రిజర్వేషన్లపై సంఘ్ అభిప్రాయాన్ని వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: