వ్యవసాయం చేసుకునే రైతులకి ఆర్ధిక భరోసా ఇస్తూ వారి అభివృద్ధి లో కీలక భాగస్వాములుగా ఉన్న సహకార బ్యాంకులలో అత్యంత కీలకమైనవి కోపరేటివ్ బ్యాంక్ లు. రైతులకి ఎంతో నమ్మకంగా కొన్ని సంవత్సరాలుగా వారికి ఎంతో తోడ్పాటుని అందిస్తున్న ఈ బ్యాంకులు. భారత దేశ మొత్తంలో విస్తరించి ఉన్నాయి. ఏ రాష్ట్రానికి తగ్గట్టుగా ఆ రాష్ట్రనికి ఈ సంస్థలు ఏర్పాటు అయ్యాయి. ఇందులో పని చేస్తున్న ఉద్యోగాలకి కమర్షియల్ బ్యాంకులకి ధీటుగా వేతనాలు ఇస్తూ మరింత  వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.

 

ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని స్టేట్ కోపరేటివ్ అపెక్స్ బ్యాంక్ తమ శాఖల పరిధిలో ఉన్న స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు పొందు బరచబడ్డాయి.

 

పోస్టుల వివరాలు /సంఖ్య : స్టాఫ్ అసిస్టెంట్ -64 ఖాలీలు

అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచీ డిగ్రీ ఉత్తీర్ణత. స్థానికులు మాత్రమే ఈ ఉద్యోగాలకి అర్హులు.

వయసు : 20 – 28 ఏళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకి వయసు సడలింపు వర్తిస్తుంది. 

ఎంపిక విధానం : రాత పరీక్ష

దరఖాస్తు విధానం : ఆన్లైన్

దరఖాస్తు చివరి తేదీ : 30-09-2019

పరీక్ష తేదీ : 02-11-2019

మరిన్ని వివరాల కోసం  : https://tscab.org


మరింత సమాచారం తెలుసుకోండి: