ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. చిరుద్యోగుల జీతాలను ఆయన అమాంతం పెంచేస్తున్నారు.


గతంలో ఆశావర్కర్ల వేతనాలు పెంచారు. ఇప్పుడు హోంగార్డుల వేతనాలు పెంచుతున్నారు. అదే సమయంలో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం వారికి ఇస్తున్న గౌరవవేతనాన్ని ఏకంగా మూడు రెట్లు చేసింది.


ఇప్పటి వరకూ మధ్యాహ్న భోజన నిర్వాహకులకు గౌరవ వేతనంగా కేవలం ఒక్క వేయి రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. వీరి బాధలను గమనించిన జగన్ వారి గౌరవ వేతనాన్ని వేయి రూపాయల నుంచి ఏకంగా మూడు రెట్లు పెంచి రూ.3 వేలు పెంచి నిర్ణయించారు.


ఈ మేరకు జగన్ ఆధ్వర్యంలోని మంత్రివర్గం తీర్మానం చేసింది. దీని వల్ల 52296 మంది మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు లబ్ధి చేకూరుతుంది. ఇందుకోసం రూ.211.91 కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం తీర్మానం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: