ఈరోజుల్లో ఏ ఉద్యోగం కావాలన్న డిగ్రీ అడుగుతున్నారు. కానీ కొంత మంది కేవలం పదో తరగతి వరకూ మాత్రమే చదువుతారు. అనేక కారణాలతో చదువు ఆపేస్తారు. అలాంటి వారి కోసం కూడా కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. అలాంటిదే ఈ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు.


కేవలం పదో తరగతి తోనే ప్రభుత్వ ఉద్యోగం అందుకునే అవకాశం ఇది. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పోస్టల్ డిపార్ట్ మెంట్ లో తెలుగు రాష్ట్రాల్లో మూడువేల ఆరు వందలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు అర్హత కేవలం పదో తరగతి మాత్రమే. అంతేకాదు.. అంతకన్నా ఎక్కువ అర్హతలు ఉన్నా పట్టించుకోరు.


అంతే కాదు.. ఈ ఉద్యోగాల కోసం ఎలాంటి రాత పరీక్షలు ఉండవు.. కేవలం టెన్ లో సాధించిన మార్కుల ఆధారంగానే ఉద్యోగం ఇచ్చేస్తారు. గ్రామీణ డాక్ సేవక్ విభాగంలో తెలుగు రాష్ట్రాల్లో3,677 పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 2707, తెలంగాణలో 970 ఖాళీల్లో బ్రాంచి పోస్టుమాస్టర్, అసిస్టెంట్ బ్రాంచి పోస్టు మాస్టర్ , డాక్ సేవక్ ఉద్యోగాలు ఉన్నాయి. వివరాల కోసం http://appost.in/gdsonline వెబ్ సైట్ చూడొచ్చు.


ఇంకా రూల్స్ ఏంటంటే.. టెన్త్ లో గణితం, ఇంగ్లిష్, స్థానిక భాషను తప్పనిసరిగా చదివి ఉండాలి. మొదటి ప్రయత్నంలో పదోతరగతి పాసైనవాళ్లకి ప్రాధాన్యం. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: నవంబరు 14, 2019. మరి ఇంకేం త్వరపడండి.. ఉద్యోగం సాధించండి.


మరింత సమాచారం తెలుసుకోండి: