ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి కూడా భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బెంగ‌ళూరులోని భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) కాంట్రాక్ట్ పద్ధతిలో ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరడం జరిగింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు తగు అనుభవం ఉండాలి అని తెలియచేసింది.  ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అని తెలిపింది నోటిఫికేషన్. ఇక ఎంపిక విధానానికి వస్తే రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.


పోస్టుల వివరాలు చుస్తే మొత్తం ఖాళీల సంఖ్య: 19, విభాగాల వారీగా ఖాళీలు మాత్రం  ఎల‌క్ట్రానిక్స్-13, మెకానిక‌ల్‌-06 ఉన్నాయి. ఇక అర్హత విషయానికి వస్తే  స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. తగిన అనుభ‌వం తప్పనిసరగా ఉండాలి అని తెలిపారు. ఇక ఎంత   అనుభవం విషయానికి వస్తే  అభ్యర్థులకు కనీసం 6 నెలల ఇండస్ట్రియల్ అనుభవం ఉండాలి అని తెలియచేయడం జరిగింది.


ఇక   వయసు  పరిమితి  01.11.2019 నాటికి 25 సంవత్సరాలకు మించి ఉండకూడదు అని తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి ఉంటుంది. ఎంపిక విధానం మాత్రం  రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఉంటుంది.  ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో కాబట్టి  కాంట్రాక్ట్ వ్యవధి కచ్చితంగా చూసుకోవాలి. వ్యవధి మాత్రం   ఏడాది అవసరానికి అనుగుణంగా 3 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది అని తెలియచేయడం జరిగింది.


ముఖ్యమైన తేదీలు చూద్దామా మరి  ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.10.2019.   02.11.2019 లోపు  దరఖాస్తు చేసుకోవాలి. ఆశక్తి  అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు చదివి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.


మరింత సమాచారం తెలుసుకోండి: