ఇపుడు పిల్లల చదువు అంటే తల్లిదండ్రులకి ఫీజుల గురించి దిగులు పట్టుకుంది.అలాంటిది  ఈ కాలేజీ కొంచెం వింతగా ఉంటుంది వివరాల్లోకి వెళితే.పలమనేరు పట్టణంలోని తీర్థం కృష్ణయ్యశెట్టి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల  తొలి నుంచి ఈ కళాశాలకు మంచి పేరుంది. సంప్రదాయ కోర్సులతోపాటు ఇక్కడ తొమ్మిది రకాల వృత్తి విద్యా కోర్సులు అన్ని వసతులతో ఉన్నాయి. ఈ కోర్సుల్లో సెరికల్చర్‌కి సంబంధించి ఏటా 20మంది విద్యార్థులు ఈ కోర్సులో విద్యనభ్యసించే అవకాశం ఉంది.

గత పదేళ్లుగా ఇక్కడ సెరికల్చర్‌ కోర్సును పూర్తి చేసుకున్నవారు వందమంది వరకు ఉన్నారు. వీరిలో పలువురు పట్టుపరిశ్రమ శాఖకు సంబంధించి ప్రైవేటు రంగంలో ఉపాధి పొందుతున్నారు.మరికొందరు సొంతంగా మల్బరీని సాగుచేసి పట్టుగూళ్ల పెంపకం సాగిస్తున్నారు. 


ఇటీవల ప్రభుత్వం గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు అవకాశం కల్పించింది. దీంతో తాజాగా కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు సెరికల్చ ర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. సమయం తక్కువగా ఉండడం, కనీసం సిలబస్‌ ఎలా ఉంటుందో తెలియక, ఈ కోర్సుకు సంబంధించిన మెటీరియల్‌ కూడా దొరక్క ఇబ్బందులు పడ్డారు. ఈసమయంలో ఈ కళాశాలలో సెరికల్చర్‌ అధ్యాపకురాలిగా ఎంతో అనుభవం కలిగిన రాజేశ్వరి ప్రత్యేక చొరవచూపారు.సచివాలయ పరీక్షల్లో ఈ కళాశాలకు చెందిన 23మంది ఉద్యోగాలకు ఎంపిౖకై రికార్డు సృష్టించారు. 


నేను అధ్యాపకురాలిగా ఇక్కడ 29 ఏళ్లుగా పనిచేస్తున్నా. సిరికల్చర్‌ కోర్సు చేసిన పూర్వ విద్యార్థులు, తాజాగా కోర్సు చేసిన వారు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి నన్ను సంప్రదించారు. ఎలా చదవాలి, సిలబస్, మెటీరియల్‌ అందుబాటులో లేదన్నారు. దీంతో నేనే తయారు చేసిచ్చా. 23మంది నా వద్ద శిక్షణ పొందిన పిల్లలకు ఉద్యోగాలు రావడం చాలా ఆనందంగా ఉంది అని రాజేశ్వరి, సెరికల్చర్‌ అధ్యాపకురాలు తెలిపారు .   


మరింత సమాచారం తెలుసుకోండి: