అమ్మఒడి ఇప్పుడు ఏపీలో సంచలన పథకం ఇది. అయితే ఈ పథకంపై చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఇది ఎవరికి వర్తిస్తుంది.. ఎవరికి వర్తించదు అన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తాజాగా వీటిపై క్లారిటీ వచ్చేసింది. మంత్రి వర్గం విధివిధానాలకు ఆమోదం తెలిపింది.


కొత్త రూల్స్ ప్రకారం.. ఒకటవ తరగతి నుంచి 12 తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు, సంరక్షకులకు ఈ పధకం వర్తింపచేశారు. ఈ పథకం అందుకోవాలంటే.. పిల్లలకు ఆధార్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఒకవేళ పేదరికం పరంగా అర్హత ఉన్నప్పటికీ రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు అర్జీ ఉంటే లబ్దిదారులుగా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.


జనవరి లో బ్యాంకు ఖాతాలకు ఈ నిధుల జమ అయ్యేలా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ప్రైవేటు స్కూళ్లలో చదివే వారికి అమ్మఒడి పథకం వర్తించదని గతంలో ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదు.


పిల్లలు ఏ స్కూల్ లో చదువుతున్నారన్నది విషయం కాదు.. వారికి తెల్ల రేషన్ కార్డు ఉందా లేదా అన్నదే అర్హతను నిర్ణయిస్తుంది. తాజా కేబినెట్ సమావేశంలో అమ్మఒడి పథకానికి 6450 కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేసేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదాన్ని తెలియ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: