పెద్దగా చదవుకోలేదని బాధపడే వారికి శుభవార్త.. కంప్యూటర్ యుగంలో దేనికైనా కంప్యూటర్ విద్య అవసరమైపోయింది. అందుకే కేవలం 18 ఏళ్లు నిండితే చాలు.. ఫ్రీగా కంప్యూటర్ ట్రైనింగ్ అందిస్తుందో సంస్థ.. తెలంగాణ పట్టణ నిర్మూలన సంస్థ, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిరుద్యోగయువతి, యువకులకు ఈ అవకాశం కల్పిస్తున్నారు.


ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉపాధి కల్పన కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆల్ ఇండియా లోకల్ గవర్నమెంట్ సంస్థ డైరెక్టర్ జి. వి. రాంమూర్తి బుధవారం తెలిపారు. దరఖాస్తు చేసేందుకు 18 నుంచి 32 సంవత్సరాల వయసున్న యువత అర్హులు. దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 2 ఆఖరి తేదీ.


వివరాలకు వనస్థలిపురం పనామ సమీపంలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్, 9391219991, 9985574468 నంబర్లలో సంప్రదించాలని కోరారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.. సమయం ఎక్కువగా లేదన్న సంగతి గుర్తుంచుకోవాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: