నేటి తరంలో తరగతి సబ్జక్టులో ఎంత పర్ఫెక్టుగా ఉన్నా.. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఉద్యోగాలు రావడం కష్టంగా మారింది. ఒకవేళ ఉద్యోగం దొరికినా దాన్ని నిలబెట్టుకోవడానికీ కమ్యూనికేషన్ స్కిల్స్ అత్యవసరం గా మారాయి. మరి వాటిలో అత్యంత కీలకమైంది ఇంగ్లీష్. దీనిపై పట్టులేక చాలామంది వెనుకబడుతుంటారు.


అందుకే.. ఆంగ్ల భాష నైపుణ్యంపై ఓయూలో 5 నుంచి ప్రత్యేక కోర్సును అందిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆంగ్ల భాష శిక్షణ కేంద్రం ( సెల్ట్) ఆధ్వర్యంలో ఆంగ్ల భాషనైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం కోసం ఈ నెల 5 నుంచి ప్రత్యేక కోర్సు నిర్వహిస్తున్నారు.


ఉదయం, సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య రెండు విడతల్లో తరగతులు ఉంటాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు. కోర్సులో చేరాలనుకున్నవారు.. ప్రిన్సిపల్, సెల్ట్, యూసీఈ, ఓయూ హైదరాబాద్ పేరిట డీడీతీసి పంపించాలని కేంద్రం డైరెక్టర్ సూచించారు.


మరిన్ని వివరాల కోసం 9652856107 లేదా 7416575575 ఫోన్ నంబర్లను లేదాwww.uceou.edu/CELT/ లో సంప్రదించాలి. ఇంకేం మీ ఇంగ్లీష్ మెరుగుపరుచుకోండి. జీవితంలో దూసుకుపోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: