దేశ విద్యారంగంలో ఎన్‌సీఈఆర్టీకి కీలక పాత్ర. ఎన్‌సీఈఆర్టీ అంటే.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్. దీని ప్రధాన కార్యాలయం డిల్లీలో ఉంది. దేశంలో పాఠశాలల సిలబస్ ను ఇది రూపొందిస్తుంది. అందుకు అవసరమైన పాఠ్యపుస్తకాలను రూపొందించి ప్రచురిస్తుంది.


అలాంటి కీలకమైన సంస్థలో ఉద్యోగాలకు అవకాశం లభించింది. హెడ్ పబ్లికేషన్, ఎడిటర్, అసిస్టెంట్ ఎడిటర్, ఎడిటోరియల్ అసిస్టెంట్, ఫిల్మ్ ప్రొడ్యూసర్, సౌండ్ రికార్డిస్ట్, టీవీ ప్రొడ్యూసర్, అసిస్టెంట్ ఇంజినీర్, స్క్రిప్ట్ రైటర్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. మొత్తం 52 పోస్టులు ఉన్నట్టు ఈ సంస్థ తెలిపింది.


ఇక ఈ పోస్టులకు అర్హతలు పరిశీలిస్తే.. ఒక్కో పోస్టుని అనుసరించి మెట్రిక్యులేషన్ సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం ఆధారంగా ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు పూర్తి నోటిఫికేషన్ ను పరిశీలించాల్సి ఉంటుంది.


రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్ లైన్‌లో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంప్లాయిమెంట్ న్యూస్ (నవంబరు 2-8) లో ఈ ప్రకటన వెలువడింది. ఆ తేదీ నుంచి 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సంప్రదించాల్సిన వెబ్ సైట్ ఇదీ. http://ncert.nic.in/


మరింత సమాచారం తెలుసుకోండి: