యూపీపీఎస్సీ.. కేందప్రభుత్వ ఉద్యోగాలు అందించే సంస్థ.. కేంద్ర ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారి నుంచి అటెండర్ పోస్టు వరకూ అనీ యూపీపీఎస్సీ చేతుల మీదుగానే జరగుతుంటాయి. అలాంటి కీలక సంస్థలో ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ .. యూపీఎస్సీలో పలు రకాల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం ఉద్యోగాల ఖాళీల సంఖ్య 153 పోస్టులు. ఇవి పలు విభాగాల్లో ఉన్నాయి. అవేమిటంటే.. ఎగ్జామినర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. విభాగాలు: బయో కెమిస్ట్రీ, కార్డియాలజీ, ఎండో క్రైనాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, పల్మనరీ మెడిసిన్, పాథాలజీ, రేడియో డయాగ్నసిస్ వంటివి.


ఆయా పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జక్టుల్లో అర్హత సాధించి ఉండాలి. అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు చేపడతారు. ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ ద్వారా 28.11.2019 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం www.upsc.gov.in వెబ్ సైట్ ను పరిశీలించవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: