ప్రతిభను ప్రోత్సహించేందుకు అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ప్రైవేటు సంస్థల సంగతి ఎలా ఉన్నా.. ప్రభుత్వం అందిస్తున్న చాలా సదుపాయల గురించి చాలా మందికి తెలియదు. అసలు ఇలాంటి అవకాశం ఉందని తెలియని వారు ఎందరో ఉంటారు.


అలాంటిదే ఈ సమాచారం కూడా.. ఇంటర్ లో మీకు మంచి మార్కులు వచ్చాయా.. నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారా.. లేదా.. అయితే త్వరపడండి.. మరో రెండు రోజుల్లో గడువు ముగుస్తోంది మరి. ఇంటర్ మీడియట్ లో మంచి మార్కులు సంపాదించుకున్న వారికి కేంద్రప్రభుత్వం రెండేళ్లపాటు స్కాలర్ షిప్ ఇస్తుంది.


నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ ద్వారా కొత్త వారు, రెన్యువల్ చేసుకోవాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 2019 మార్చిలో ఇంటర్మీడియెట్ పాసైన వారితో పాటు 2019-20 విద్యార్థులు కూడా అర్హులే. ఈ పథకంలో ప్రతి రాష్ట్రానికీ నిర్దిష్ట సంఖ్యలో స్కాలర్ షిప్పులు ఉంటాయి.


తెలంగాణ విషయానికి వస్తే.. కేంద్రం 2750 స్కాలర్‌షిప్పులు కేటాయించింది. మరిన్ని వివరాల కోసం ఇంటర్ స్టూడెంట్స్... http://scholarships.gov.in వెబ్ సైట్ చూడొచ్చు. ఇదే వెబ్ సైట్ ద్వారా తమ వివరాలను నవంబరు 15వ తేదీ లోగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంటర్ చదివే వారు కాకపోయినా మీకు తెలిసిన వారికి తెలియజేయండి. ప్రతిభను ప్రోత్సహించిన వారవుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: