నిరుద్యోగులు.. అని చెప్పకుండా చెయ్యాలి అనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం. అందుకే.. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఒక దానిపై ఒకటి విడుదల చేస్తున్నాయి. మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్  రెడ్డి నాలుగు నెలలలో నాలుగు లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాడు. ఇంకొక నెలలో మరికొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చెయ్యనున్నారు. 


ఈ నేపథ్యంలోనే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్‌లో(CISF)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అసిస్టెంట్ సబ్‌ఇన్స్‌పెక్టర్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు. అర్హులైన అభ్యర్థులు అందరూ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చెయ్యాల్సి ఉంటుంది. 


ఆన్లైన్ ద్వారా ధరఖాస్తులు పూర్తి చేసేకి డిసెంబర్ 9, 2019 చివరి తేదీ. కాగా ఈ ఉద్యోగాల సంస్ద పేరు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్‌, 1314 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. దేశవ్యాప్తంగా ఈ పోస్టుల భర్తీ జరుగుతుంది. కాగా ఈ ఉద్యోగానికి విద్యార్హత డిగ్రీ చదివి ఉండాలి. 


ఈ పోస్టులకు వయో పరిమితి 18 ఏళ్ల నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టు ద్వారా ఎంపిక చేస్తారు. అయితే ఈ ఉద్యోగ దరఖాస్తుకు ఎటువంటి ఫీజు లేదు. ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలు కోసం cisf.gov.in వెబ్ సైట్ ను చుడండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: