ఇటీవల కొన్ని ప్రభుత్వ కంపెనీలు నోటిఫికేషన్లు ఇచ్చాయి. సీఎస్‌ఐఓలో టెక్నికల్‌ స్టాఫ్‌ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌)కి చెందిన చండీగఢ్‌లోని సెంట్రల్‌ సైంటిఫిక్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఆర్గనైజేషన్‌(సీఎస్‌ఐఓ)లో 27 ఉద్యోగాలు ఉన్నాయి.


ఈ 27 పోస్టుల్లో వివిధ రకాలు ఉన్నాయి. అవేమిటంటే.. సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌, సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌. ఈ పోస్టులకు ఒక్కో పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత అర్హతలుగా నిర్ణయించారు.


ఈ పోస్టులకు అనుభవం కూడా అవసరం. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చివరితేది డిసెంబరు 15. మరిన్ని వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ చూడండి. https://www.csio.res.in/


మరింత సమాచారం తెలుసుకోండి: