ముంబయిలోని
బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ వివిధ విభాగాలలో వివిధ ఖాళీల భర్తీకి
అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడం జరిగింది. ఇక పోస్టుల వారీగా విద్యా అర్హతలను కూడా నిర్ణయించడం జరిగింది. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ తెలుపుతుంది. ఉద్యోగ నియామకాలు మాత్రం రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ద్వారా చేపట్టడం జరుగుతుంది.
ఇక మొత్తం ఖాళీల సంఖ్య 92. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (గ్రూప్-బి నాన్-గెజిటెడ్) 19 పోస్టులు కలవు. ఇక పోస్టుల కేటాయింపు విషయానికి వస్తే ఎస్సీ-08, ఎస్టీ-02, ఓబీసీ-03, జనరల్-05, ఈడబ్ల్యూఎస్-01. ఇక సంబంధిత
అర్హత ఐతే ఏదైనా
డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇక శారీరక ప్రమాణాలు విషయానికి వస్తే పురుషులు-167 సెం.మీ ఎత్తు, మహిళలు-157 సెం.మీ. ఎత్తు కచ్చితంగా ఉండాలి. పురుషులకు ఛాతీ కనీసం 80 సెం.మీ, గాలిపీల్చినప్పుడు 85 సెం.మీ. కచ్చితంగా ఉండాలి.
ఇక వయసు వయోపరిమితి మాత్రం దరఖాస్తు గడువు ముగింపు సమయానికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 32 సంవత్సరాలు, ఓబీసీలకు 30 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపుకు వర్తిసుంది అని నోటిఫికేషన్ తెలుపుతుంది. ఇక పేస్కేల్ విషయానికి వస్తే లెవల్-6 పే మ్యాట్రిక్స్ కింద నెలకు రూ.35,400తో పాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి.
ఇక సెక్యూరిటీ గార్డ్ దరఖాస్తుకు 73 పోస్టులు కలవు. పోస్టుల కేటాయింపు వస్తే ఎస్సీ-15, ఎస్టీ-6, ఓబీసీ-20, జనరల్-26, ఈడబ్ల్యూఎస్-6. సెక్యూరిటీ గార్డ్
అర్హత మాత్రం పదోతరగతి. ఇక వయసు వయోపరిమితి దరఖాస్తు గడువు ముగింపు సమయానికి 18- 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 32 సంవత్సరాలు, ఓబీసీలకు 30 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిసుంది అని నోటిఫికేషన్ తెలుపుతుంది. ఇక పేస్కేల్ విషయానికి వస్తే లెవల్-1 పే మ్యాట్రిక్స్ కింద నెలకు రూ.18,000 ఇస్తారు. ఇతర అలవెన్సులు లభిస్తాయి. దరఖాస్తు ఫీజు వివరాలు చుస్తే అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు రూ.150, సెక్యూరిటీ గార్డు పోస్టులకు రూ.100 చెల్లించాలి.
ఎస్సీ,
ఎస్టీ, ఎక్స్-సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది.