ఇప్పుడు కుర్రాళ్లందరి దృష్టీ సాఫ్ట్ వేర్ రంగంపైనే.. ఐటీ రంగంలో వచ్చే జీతాలు, అవకాశాలు అలాంటివి మరి. ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుడి కోసం చూస్తున్నారు. ఐతే.. కొన్ని రోజులుగా ఐటీ రంగంలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

 

చివరకు కాగ్నిజంట్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ సమయంలో మరో పిడుగులాంటి వార్త వినిపిస్తోంది. భారత ఐటీ రంగంలో వచ్చే ఏడాది 30 నుంచి 40 వేల మధ్యస్థాయి ఉద్యోగాలు పోయే అవకాశం ఉందట. ఈ విషయాన్ని బయటపెట్టారు ఐటీ రంగ నిపుణుడు మోహన్ దాస్ పాయ్.

 

ఇతర దేశాల్లోలాగే మన దేశంలోనూ మార్కెట్ పరిస్థితులను అనుసరించి కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటుంటాయని ఐటీ రంగ నిపుణుడు మోహన్ దాస్ పాయ్ చెబుతున్నారు. కంపెనీ పురోగమనంలో ఉన్నప్పుడు ప్రమోషన్ల కారణంగా మధ్యస్థాయి ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది.. ఈ క్రమంలో కంపెనీలు సర్దుబాటుకు దిగుతాయి. ఈ క్రమంలో మధ్యస్థాయి ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవచ్చని చెబుతున్నారు ఐటీ రంగ నిపుణుడు మోహన్ దాస్ పాయ్.

 

ఐటీ కంపెనీలో ప్రతి ఐదారేళ్లకొకసారి జరిగే ప్రక్రియే ఇది అంటున్నారు. అలాగే ఈ ఏడాది ఐటీ రంగంలోని 30 నుంచి 40 వేల మధ్యస్తాయి ఉద్యోగులపై ప్రభావం పడొచ్చని ఆయన విశ్లేషిస్తున్నారు. అయితే అంత కంగారు పడాల్సిన పనిలేదని.. ఉద్యోగాలు కోల్పోయే వారిలో 80 శాతం మందికి వేరే రంగాల్లో ఉద్యోగాలు దొరుకుతాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: