ఈ మధ్యకాలంలో నిరుద్యోగులకు శుభవార్తలు మీద శుభవార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు కేంద్ర మరోవైపు రాష్ట్రం ఇలా ఉద్యోగాల మీద ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తూనే ఉంది. అలానే ఎన్నికలు అనంతరం ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేవలం నాలుగు నెలలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చి రికార్డు సృష్టించాడు. అయితే ఈ నేపథ్యంలోనే నార్త్‌ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. 

 

వివరాల్లోకి వెళ్తే... నార్త్ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో మొత్తం 16 ఖాళీలు ఉన్నట్టు ప్రకటించింది. అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, సైక్లింగ్ లాంటి క్రీడల్లో నైపుణ్యం సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా డిసెంబర్ 16 చివరి తేదీ. అయితే ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

 

అయితే ఈ పోస్టులలో మొత్తం ఖాళీలు 16 ఉండగా అథ్లెటిక్స్ లో ఒకటి, బాస్కెట్ బాల్ లో 3, బ్యాడ్మింటన్ లో 3, సైక్లింగ్ లో 2, క్రికెట్ లో ఒకటి, పవర్ లిఫ్టింగ్ లో 2, వాలీబాల్ లో 1, వెయిట్‌లిఫ్టింగ్ లో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 16 సాయంత్రం 5:30 నిమిషాలు. అయితే ఈ పోస్టులకు విద్యార్హత 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండాలి. 

 

కాగా ఈ పోస్టులకు వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. అంతేకాదు స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయనున్న పోస్టులు కాబట్టి ఆయా క్రీడల్లో నిబంధనల ప్రకారం ప్రతిభ చూపినవారే అర్హులు. కాగా నార్త్ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ https://nfr.indianrailways.gov.in వెబ్‌సైట్‌లో చుడండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: