తెలంగాణలో విద్యుత్‌శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం 'టీశాట్' నెట్‌వర్క్ చానెళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నవంబరు 20 నుంచి ఆయా చానెళ్లలో అవగాహన పాఠ్యాంశాలు ప్రసారలు మొదలు అవుతున్నాయి. ‘టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఉద్యోగ గైడ్‌' పేరుతో ప్రసారమయ్యే కార్యక్రమాలు డిసెంబరు 21 వరకు అందుబాటులో ఉంటాయి.

 

ఉద్యోగార్థులకు ఈ నెల రోజుల కాలంలో దాదాపు 160 గంటల పాటు వివిధ సబ్జెక్టుల్లో అవగాహన కార్యక్రమాలు ప్రసారం చేయ పోతున్నారు. ప్రతి రోజూ ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు 'విద్య' చానల్‌లో, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు 'నిపుణ' చానల్‌లో పాఠ్యాంశాల బోధన కార్యక్రమాలు వస్తాయి. నియామక రాతపరీక్షలో ప్రశ్నలు వచ్చే దాదాపు 15 సబ్జెక్టుల నుంచి పాఠ్యాంశాలను గురించి వివరించ పోతున్నారు. వీటితోపాటు టీ-శాట్ యాప్‌, tsat.tv వెబ్‌సైట్‌లో కూడా కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు.

TSSPDCLలో 3,025 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన  సంగతి అందరికి తెలిసిందే కదా. వీటిలో జూనియర్ లైన్ మెన్ పోస్టులు 2500, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ (JPO) పోస్టులు 25, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ 500  పోస్టులు ఉన్నాయి . మొత్తం పోస్టులు 3,025  పోస్టులు ఉన్నాయి 


ఇక ముఖ్యమైన తేదీల విషయానికి వస్తే... పోస్టులు,దరఖాస్తు ప్రక్రియ పరీక్ష తేదీ పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో తెలియచేయడం జరిగింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఉద్యోగ గైడ్‌ కార్యక్రమాలు క్రమం తప్పకుండా చూడండి.  మీ ఆశయాన్ని నెరవేర్చుకొండి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు  నోటిఫికేషన్ లో  పూర్తి వివరాలు చదివి అప్లై చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: