బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇందులో
అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డుల పోస్టులను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 6 డిసెంబర్ 2019.
సంస్థ పేరు: బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్
పోస్టు పేరు: అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డు పోస్టుల సంఖ్య: 92
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: 6 డిసెంబర్ 2019
విద్యార్హతలు: అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
సెక్యూరిటీ గార్డు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి
వయస్సు: 18 ఏళ్ల నుంచి 32 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ టెస్టు
అప్లికేషన్ ఫీజు: అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్: రూ.150/- సెక్యూరిటీ గార్డు: రూ. 100/-
ముఖ్యతేదీలు: ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 16 నవంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 6 డిసెంబర్ 2019
మరిన్ని వివరాలకు : లింక్: http://bit.ly/37mrTKv