తెలంగాణలో కార్మిక ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖలో ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది.మొత్తం 28 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా వీటి భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 

 

వీటిలో కార్మిక శాఖలో 15, ఫ్యాక్టరీల డైరెక్టరేట్‌ పరిధిలో 13 పోస్టులు ఉన్నాయి. భర్తీకి అనుమతించిన వాటిలో కార్మికశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టులు ఏడు, సీనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పోస్టులు 3, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 16, అసిస్టెంట్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పోస్టులు ఒక్కోటి ఉన్నాయి.

 

అయితే ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పడు ఇవ్వాలన్నది ఇక టీఎస్ పీఎస్సీ చేతిలో ఉంటుంది. ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే.. టీఎస్ పీఎస్సీ త్వరలోనే వీటికి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాకుండా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ ప్రారంభించడం ద్వారా ఇలాంటి ఉద్యోగాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: