సీఆర్‌పీ ఎగ్జామినేషన్-IX ద్వారా ఐబీపీఎస్ పరిధిలోని వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొత్తం 12,075 క్లర్కు పోస్టులను భ‌ర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణకు 612 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌కు 777 పోస్టును కేటాయించారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రెండు దశల (ప్రిలిమినరీ, మెయిన్) రాతపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

 

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ‌ 17.09.2019 ప్రారంభమయ్యి., ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు, ఫీజు చెల్లింపున‌కు 09.10.2019 చివరితేదీగా ఉంది. కాగా, ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లను నవంబరు 26 మంగళవారం విడుదల చేసింది. ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునాని స్పష్టం చేసింది. అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ లేదా రూల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినరోజు వివరాలు అవసరమవుతాయి. డిసెంబరు 8 వరకు కాల్ లెటర్లు అందుబాటులో ఉండనున్నాయని తెలిపారు.
 


క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షలను డిసెంబరు 7, 8, 14, 21 తేదీల్లో నిర్వహించనున్నారు. కాగా, డిసెంబరు చివరివారంలోనే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించినవారికి వచ్చే ఏడాది జనవరి 19న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. డిసెంబరులో మెయిన్ పరీక్ష ఫలితాలను వెల్లడించనున్నారు. మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన వారికి తదుపరి దశలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. జనవరి లేదా ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఏప్రిల్ నాటికి తుది నియామకాలు చేయనున్నారు.

 

ఐబీపీఎస్ పరిధిలోని బ్యాంకులు  అల‌హాబాద్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్,  బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెన‌రా బ్యాంక్‌, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేష‌న్ బ్యాంక్‌, దేనా బ్యాంక్, ఇండియ‌న్ బ్యాంక్‌, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్‌, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: