నిరుద్యోగులకు ప్రతి రోజు ఏదొక విధంగా ఎక్కడొక చోట ఉద్యోగ నోటిఫికేషన్లు పడుతూనే ఉన్నాయి. ఒకసారి కేంద్రం నుండి నోటిఫికేషన్ విడుదల అవుతే మరోసారి రాష్ట్రం నుండి నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఇలా ఎక్కడ పడితే అక్కడ నోటిఫికేషన్ విడుదల అయ్యి నిరుద్యోగులకు తీపి కబురు అందుతుంది. అయితే ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగుల కోసం ఆంధ్ర యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలలోనే నాలుగు లక్షలమందికి ఉద్యోగాలు కల్పించి రికార్డు సృష్టించగా ఇప్పుడు తెలంగాణ సర్కార్ వంతు వచ్చింది. 

 

ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి స్కైవర్త్ గ్రూప్ బోర్డు చైర్మన్ లై వీడ్ సహా కంపెనీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు హైదరాబాద్‌లో ఐటీ, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. 

 

స్కైవర్త్ కంపెనీ తెలంగాణాలో ఒకేసారి కాకుండా దశల వారీగా పెట్టుబడులు పెట్టనుంది. అయితే ఇందులో భాగంగానే మొదటి దశలో హైదరాబాద్‌లో రూ.700 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. 50 ఎకరాలలో ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో రాష్ట్ర చరిత్రలో ఇదే అతిపెద్ద పెట్టుబడి. అయితే స్కైవర్త్ హైదరాబాద్‌ను తన ఉత్పాదక గమ్యస్థానంగా ఎంచుకుంది, దీని వల్ల 5,000 మందికి పైగా ఉపాధి లభిస్తుందని కేటీఆర్ తెలిపారు. 

 

ఈ సందర్భంగా బోర్డు చైర్మన్ మిస్టర్ లై వీడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ విధానాలు పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీకి ప్రభుత్వం నుంచి లభిస్తున్న ప్రోత్సాహం అభినందనీయం అని అయన అన్నారు. అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఏది ఏమైనా తెలంగాణ నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: