నీట్ 2020 విద్యా సంవత్సరం నుంచి అన్ని వైద్యకళాశాలలు, ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశాలకు 'నీట్' ద్వారానే ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  నీట్ పరిధిలో  ఎయిమ్స్, జిప్‌మర్ విద్యాసంస్థలు వస్తున్నాయి. ఇక  దేశ వ్యాప్తంగా ఉన్న వైద్యకళాశాలల్లో 2020 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్,  బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న 'నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)-2020' నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డిసెంబరు 2న వెల్లడించడం జరిగింది. సంబంధిత వెబ్‌సైట్‌లో ప్రవేశ ప్రకటనను అందుబాటులో ఉంది.

 

అర్హత, ఆశక్తి  గల అభ్యర్థులు డిసెంబరు 2న సాయంత్రం 4 గంటల నుంచి ఆన్‌‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను అప్లై చేసుకోవచ్చు . డిసెంబరు 31 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది అని సంస్థ పేర్కొంది. ఇక పరీక్ష షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది మే 3న నీట్(యూజీ)-2020 పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఇక పరీక్ష  సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది. నీట్ పరీక్ష హాల్‌ టికెట్లను మార్చి 27 నుంచి అందుబాటులో ఇవ్వబోతుంది సంస్థ. పరీక్ష ముగిసిన నెలరోజుల్లో అంటే.. జూన్ 4న ఫలితాలను  తెలియచేయడం జరుగుతుంది.

 


ఇదిలా ఉండగా.. వచ్చే సంవత్సరం   2020 విద్యాసంవత్సరం నుంచి అన్ని వైద్యకళాశాలలు, ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశాలకు 'నీట్' ద్వారానే ప్రవేశాలు జరగబోతున్నాయి. ఇప్పటివరకు ఎయిమ్స్, జిప్‌మర్ సంస్థలు ఎంబీబీఎస్/ బీడీఎస్ ప్రవేశాలకు విడిగా ప్రవేశ పరీక్షలు నిర్వహించడం జరిగింది కానీ ప్రస్తుతం  మాత్రం నీట్ పరిధిలోకి  తీసుకోబోతున్నారు . అయితే నేషనల్ మెడికల్ కమిటీ యాక్ట్ ప్రకారం 2020 విద్యా సంత్సరం నుంచి నీట్ ద్వారానే ఈ సంస్థల్లో ప్రవేశాలు జరపాల్సి ఉంటుంది అని సంస్థ వెల్లడించింది.

 

 నోటిఫికేషన్ కి సంబంధించి ముఖ్యతేదీలు:

* నీట్ నోటిఫికేషన్ చేసుకోవడానికి, ఆన్‌లైన్ దరఖాస్తు: 02.12.2019

*దరఖాస్తుకు చేసుకోవడానికి చివరితేదీ: 31.12.2019

* అడ్మిట్ కార్డు డౌన్‌లోడింగ్: 27.03.2020

* పరీక్ష తేదీ: 03.05.2020

* ఫలితాల వెల్లడి: 04.06.2020

మరింత సమాచారం తెలుసుకోండి: