ఇంటర్ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు ఎంతగానో ఎదురు చూసే పరీక్ష ఎంసెట్.. ఇప్పుడు ఆ పరీక్ష తేదీ వచ్చేసింది. తెలంగాణలో ఎంసెట్ ను మే 5 లేదా 6 నుంచి నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఎంసెట్‌ను మే నెల 5 లేదా 6వ తేదీ నుంచి ప్రారంభించే యోచనలో ఉన్నత విద్యామండలి ఉంది.

 

మే నెల 3వ తేదీన నీట్‌ జరగనుందన్న విషయం తెలిసిందే. ఈ డేట్ ఇప్పటికే కన్ ఫామ్ అయ్యింది. అందుకే.. ఆ పరీక్షకు, ఎంసెట్‌కు ఒకటి, రెండు రోజుల వ్యవధి ఉండాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి భావించింది. అందుకే... విద్యామండలి 5 లేదా 6న ఎంసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలను మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉంది.

 

ఈ రెండు తేదీల్లో ఒకదాన్ని త్వరలోనే ఫైనల్ చేసే అవకాశం ఉంది. సో.. ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ప్లాన్ చేసుకుంటే మంచిది. ఎంసెట్.. ఇంటర్ విద్యార్థులకు చాలా కీలకం. ఇందులో వచ్చే ర్యాంక్ ఆధారంగానే వారి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: