ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల అవ్వడం జరిగింది . 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు టెన్త్‌ పరీక్షలు నిర్వహించ బోతున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ షెడ్యూల్‌ ప్రకటించడం జరిగింది. ఇక పరీక్షల సమయం విషయానికి వస్తే ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరక పరీక్షలు నిర్వహిస్తామని తెలియచేయడం జరిగింది.

 

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఇలా..

మార్చి 23 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1
మార్చి 24 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2
మార్చి 26 : సెంకండ్‌ లాంగ్వేజ్‌
మార్చి 27 : ఇంగ్లీష్‌ పేపర్‌ 1
మార్చి 28 : ఇంగ్లీష్‌ పేపర్‌ 2
మార్చి 30 : గణితం పేపర్‌ 1
మార్చి 31 : గణితం పేరర్‌ 2
ఏప్రిల్‌ 01 : సైన్స్‌ పేపర్‌ 1
ఏప్రిల్‌ 03 : జనరల్‌ సైన్స్‌ పేపర్‌ 2
ఏప్రిల్‌ 04 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 1
ఏప్రిల్‌ 06 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 2
ఏప్రిల్‌ 07 : శాన్‌స్క్రిట్‌, అరబిక్‌, పెర్షియన్‌ సబ్జెక్ట్‌
ఏప్రిల్‌ 8 : ఒకేషనల్‌ పరీక్షలు

 

ఇక ఇంటర్నల్ మార్కుల విషయానికి వస్తే..పదోతరగతి విద్యార్థులకు ఇప్పటికే ఇంటర్నర్ మార్కులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ తెలిపిన సంగతి అందరికి తెలిసిందే కదా. ఇప్పటివరకు ప్రతి సబ్జెక్టులోనూ 20 ఇంటర్నల్ మార్కులు ఉండేవి. 80 మార్కులకే ప్రశ్నపత్రం ఉండేది అని అందరికి తెలిసిన విషయమే కదా. కానీ  తాజాగా ఇంటర్నల్ మార్కులను ఎత్తివేయడంతో.. ఒక్కో సబ్జెక్టులో మొత్తం 100 మార్కులకూ రాత పరీక్షే నిర్వహిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది.

 

ప్రతి సంవత్సరం లాగానే  హిందీ మినహా ప్రతి సబ్జెక్టులోనూ రెండు పేపర్లు ఉండడం జరుగుతుంది. అదే విధంగా విద్యార్థులు సమాధానాలు రాసేందుకు 18 పేజీల బుక్‌లెట్లను ఇవ్వడం జరుగుతుంది.  కానీ ఇప్పటి నుంచి విడిగా అడిషనల్ షీట్లను ఇచ్చే అవకాశం ఉండదు అని అధికారులు వెల్లడిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: