ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రాంతీయ వార్తా విభాగం తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు న్యూస్ ఎడిటర్లు, రిపోర్టర్లు (తెలుగు), న్యూస్‌రీడర్ల (తెలుగు, ఉర్దూ) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఉప సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో నివసించేవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 

ఈ ఉద్యోగం కోసం రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. న్యూస్‌ రీడర్లకు ఆడిషన్ అంటే వాయిస్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తుల సమర్పణకు 16వ తేదీ వరకు గడువు ఉన్నది.

 

మరిన్ని వివరాలు కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.newsonair.com వెబ్‌సైట్‌లో వేకెన్సీ విభాగాన్ని పరిశీలించ వచ్చు. అయితే ఇవి తాత్కాలిక ఉద్యోగాలన్న విషయం గుర్తుంచుకోవాలి. కాకపోతే.. తాత్కాలికమే అయినా.. దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాల ద్వారా అనుభవం గుర్తింపు తెచ్చుకోవచ్చు. వివరాల కోసం వెబ్ సైట్ చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: