బాంబే ఐఐటీ లో ఆదివారం రోజు... ప్రముఖ మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రాంగణ ఎంపికలు నిర్వహించింది. అయితే... ఆ ఉద్యోగ ఎంపికలలో నల్గొండ జిల్లా, మాడ్గులపల్లి మండలం, ధర్మపురానికి చెందిన తెలుగు కుర్రాడు చింతరెడ్డి సాయిచరిత్‌రెడ్డి ఎంపికయ్యాడు. ఇకపోతే... అతనికి మైక్రోసాఫ్ట్ సంస్థ ఉన్నతమైన ఉద్యోగం ఇచ్చి.. ఒక కోటి యాభై లక్షల రూపాయలను వార్షిక వేతనంగా ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. గత సంవత్సరం కూడా మరొక ఐఐటి విద్యార్థికి... ఒకటిన్నర కోట్లు ఇస్తామని భారీ ఆఫర్ ఇచ్చింది మైక్రోసాఫ్ట్ సంస్థ. 

 

 

చాలా ప్రఖ్యాతి గాంచిన ఐఐటీ బాంబేలో ఉద్యోగానికి ఎంపికైన ముగ్గురిలో సాయిచరిత్‌రెడ్డి ఒకరు కావడం గమనార్హం. ప్రస్తుతం సాయిచరిత్ రెడ్డి తన బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. చదువు పూర్తి కాకముందే ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ భారీ వేతనం ఇస్తానంటూ ముందుకు వచ్చేసరికి..అతని తల్లిదండ్రులు సైదిరెడ్డి, సీత ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

 

ఇంకొక ఐఐటీ బాంబే విద్యార్థి సచిన్ రానా... మాజీ ఐఏఎస్ రోమన్ సైని ప్రారంభించిన యుఎన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ లో వర్క్ చేయడానికి ఎంపికయ్యాడు. బ్యాచిలర్ ఆఫ్ కెమిస్ట్రీ కోర్స్ లో నాలుగవ సంవత్సరం చదువుతున్నాడు సచిన్ రానా. అయితే ఇతను తనకి తెలిసిన సబ్జెక్టు నాలెడ్జ్ ని వ్యూయర్స్ తో పంచుకోవడం అంటే... ఒక ఉపాధ్యాయుడిగా పని చేయడానికి సంవత్సరానికి 50 లక్షలు ఇస్తామని యూఎన్ అకాడమీ సంస్థ ఆఫర్ ఇచ్చింది. సచిన్ బీ.టెక్ మొదటి సంవత్సరం నుంచే అడపాదడపా యూఎన్ అకాడమీ లో పాఠాలు చెప్తూ ఎంతో మంది ఐఐటీ ఎంట్రన్స్ పరీక్షలు రాసే విద్యార్థులకు సహాయపడ్డాడు. అతని పేరు మీద మరొక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి... జెఈఈ, ఐఐటీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు గైడెన్స్ ఇస్తాడు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: