ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. హెచ్‌పీసీఎల్‌.. అనేక పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. మొత్తం వివిధ విభాగాలో 24 ఖాళీలు ఉన్నాయి. వాటిలోచీఫ్‌ జనరల్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, ఆఫీసర్‌ వంటి పోస్టులు ఉన్నాయి.

 

ప్రాసెస్‌ టెక్నాలజీస్‌, హైడ్రో ప్రాసెసింగ్‌, కెటాలసిస్‌, నానో టెక్నాలజీ, అనలిటికల్‌, బయోప్రాసెస్‌, పెట్రోకెమికల్‌, మెటలర్జీ వంటి విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి. ఈ ఉద్యోగాలకు అనుభవం కూడా తప్పనిసరి.

 

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక ఉంటుంది. ఆ తర్వాత గ్రూప్‌ టాస్క్‌, ఇంటర్వ్యూ కూడా ఉంటాయి. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబరు 31 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం https://www.hindustanpetroleum.com/ వెబ్ సైట్ చూడొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: