నిరుద్యోగులకు  ఒక మంచి శుభా వార్త తీసుకొని వచ్చింది ఢిల్లీ మెట్రో రైల్ సంస్థ. త్వరలోనే  ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌(డీఎంఆర్‌సీ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. ఈ నోటిఫికేషన్  ద్వారా దాదాపు 1492 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్, కాంట్రాక్ట్ పోస్టులను డీఎంఆర్‌సీ పోస్టులకు  దరఖాస్తులు ఆహ్వానం పలుకుతుంది. ఈ పోస్ట్లురెగ్యులర్, కాంట్రాక్ట్ పద్దతిలో ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. సంబంధింత అర్హత, పోస్ట్ వివరాలు తెలుసుకుందామా మరి....

 

మొత్తం పోస్టుల వివరాలు ఇలా..
మొత్తం ఖాళీల సంఖ్య: 1493

 సెక్షన్-ఎ: ఎగ్జిక్యూటివ్ (రెగ్యులర్): 60
 సెక్షన్-బి: నాన్-ఎగ్జిక్యూటివ్ (రెగ్యులర్): 929
 సెక్షన్-సి: ఎగ్జిక్యూటివ్ (కాంట్రాక్ట్) పోస్టులు: 106
సెక్షన్-డి: నాన్-ఎగ్జిక్యూటివ్ (కాంట్రాక్ట్) పోస్టులు: 386


ఇక సెక్షన్-ఎ ఎగ్జిక్యూటివ్ (రెగ్యులర్) పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా.

 అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్): 16
 అసిస్టెంట్ మేనేజర్ (S & T): 09
 అసిస్టెంట్ మేనేజర్ (సివిల్): 12
 అసిస్టెంట్ మేనేజర్ (ఆపరేషన్స్): 09
 అసిస్టెంట్ మేనేజర్ (ఆర్కిటెక్ట్): 03
 అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్): 01
అసిస్టెంట్ మేనేజర్ (స్టోర్స్): 04 
 అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్): 03
 అసిస్టెంట్ మేనేజర్ (లీగల్): 03


ఇందుకు అర్హత విషయానికి వస్తే  60 శాతం మార్కులతో బీఈ/బీటెక్. ఫైనాన్స్ విభాగానికి సీఏ/ఐసీడబ్ల్యూఏ, లా విభాగానికి ఎల్‌‌ఎల్‌బీ అర్హత కచ్చితంగా ఉండాలి. సంబంధిత విభాగాల్లో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి అని తెలుస్తుంది. ఇక వయసు వయోపరిమితి మాత్రం  01.12.2019 నాటికి 18 - 30 సంవత్సరాల మధ్య కచ్చితంగా ఉండాలి. 

 

ఇక  సెక్షన్-బి నాన్-ఎగ్జిక్యూటివ్ (రెగ్యులర్)  పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా.

జూనియర్ ఇంజినీర్: 164

విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్-26, ఎలక్ట్రానిక్స్-66, సివిల్-59, ఎన్విరాన్‌మెంట్-08, స్టోర్స్-05.

 

ఇందుకు అర్హత విషయానికి వస్తే  ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ, లా డిగ్రీ కచ్చితంగా ఉండాలి. ఇక వయసు వయోపరిమితి మాత్రం 01.12.2019 నాటికి కొన్ని పోస్టులకు 18-28 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 

 

ఇక సెక్షన్-సి ఎగ్జిక్యూటివ్ (కాంట్రాక్ట్) పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా...

పోస్టులుఖాళీల సంఖ్య: 106
 అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్): 01
 అసిస్టెంట్ మేనేజర్ (S &T): 17
 అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ): 07
 అసిస్టెంట్ మేనేజర్ (సివిల్): 73
 అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్): 08

 

ఇందుకు అర్హత విషయానికి వస్తే   ఇంజినీరింగ్ డిగ్రీ, ఐటీఐ కచ్చితంగా ఉండాలి. ఇక వయసు వయోపరిమితి మాత్రం  01.12.2019 నాటికి 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 

 

ఇక సెక్షన్-డి నాన్-ఎగ్జిక్యూటివ్ (కాంట్రాక్ట్) పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా...


ఖాళీల సంఖ్య: 398


 జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 120
 జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్): 125
 జూనియర్ ఇంజినీర్ (సివిల్): 139
 అసిస్టెంట్ ప్రోగ్రామర్: 01
 ఆర్కిటెక్ట్ అసిస్టెంట్: 10
 అసిస్టెంట్/సిసి: 03

 

ఇందుకు అర్హత విషయానికి వస్తే ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ కచ్చితంగా ఉండాలి. ఇక వయసు వయోపరిమితి 01.12.2019 నాటికి కొన్ని పోస్టులకు 18-28 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 

 

ఇక దరఖాస్తు విధానం విషయానికి వస్తే ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ముఖ్యమైన ఎంపిక విధానం మాత్రం  రాతపరీక్ష, మెడికల్ పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేసుకుంటారు.

ముఖ్యమైన తేదీలు


 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.12.2019.
 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 13.01.2020.
 రాతపరీక్ష పరీక్ష హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: ఈమెయిల్, ఫోన్ మెసేజ్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: