నిరుద్యోగులకు  ఒక మంచి శుభా వార్త తీసుకొని వచ్చింది సౌత్-ఈస్ట్ సెంట్రల్ రైల్వే. అది కూడా ముఖ్యంగా  స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తులు ఆహ్వానం పలుకుతుంది. చ‌త్తీస్‌గ‌ఢ్‌‌లోని బిలాస్‌పూర్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న 'సౌత్-ఈస్ట్ సెంట్రల్ రైల్వే' లో   (లెవల్ 2, 3, 4, 5) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక అర్హత పోస్టులకు అనుగుణంగా టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రైల్వే సంస్థ తెలియచేసింది.

 

ఇక పోస్టుల వివరాలు ఇలా... 

మొత్తం ఖాళీలు: 26
క్రీడాంశాల వారీగా ఖాళీల వివరాలు...

 అథ్లెటిక్స్‌: 02
 బ్యాడ్మింట‌న్‌: 04
 బాస్కెట్ బాల్‌: 04
 బాక్సింగ్‌: 03
 క్రికెట్‌: 04
 హ్యాండ్‌బాల్: 03
 హాకీ: 03
 క‌బ‌డ్డీ: 01
 ఖోఖో: 01
వాలీబాల్: 01 

 

ఇక అర్హత విషయానికి వస్తే  పోస్టుల వారీగా విద్య అర్హతలు నిర్ణయించడం జరిగింది. డిగ్రీ, ఇంట‌ర్, పదోతరగతితోపాటు ఐటీఐ అర్హత కచ్చితంగా  ఉండాలి. సంబంధిత క్రీడ‌లో జాతీయ‌/ అంత‌ర్జాతీయ స్థాయిలో పోటీ చేసి ఉండాలి అని రైల్వే సంస్థ తెలియచేసింది. ఇక వ‌య‌సు పరిమితి విషయానికి వస్తే  01.01.2020 నాటికి 18-25 సంవత్సరాల మ‌ధ్య కచ్చితంగా  ఉండాలి. ఇక దరఖాస్తు విధాన విషయానికి వస్తే  ఆన్‌లైన్‌ ద్వారా ఎంపిక ఉంటుంది. 

 

ఇక ముఖ్యమైన ఎంపిక విధానం ఐతే మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం . వీటిలో సంబంధిత క్రీడావిభాగంలో ప్రతిభ, ఫిజికల్ ఫిట్‌నెస్‌కు 40 మార్కులు స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్‌కు 50 మార్కులు; విద్యార్హత‌కు 10 మార్కులు కేటాయించడం జరిగింది. దరఖాస్తు ఫీజు మాత్రం  రూ.500. ఎస్సీ, ఎస్సీ, మహిళలు, మైనార్టీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే చాలు.

 


ముఖ్యమైన తేదీలు..


ఆన్‌లైన్ ద‌రఖాస్తు చేసుకోవడానికి  ప్రక్రియ ప్రారంభం: 14.12.2019.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చేసుకోవడానికి  చివ‌రితేది: 13.01.2020.

 

మరింత సమాచారం తెలుసుకోండి: