నానా క‌ష్టాలు ప‌డి.. పిల్లల‌ను చ‌దివిస్తే.. వారికి ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న త‌ల్లిదండ్రులెంద‌రో.  ఉన్న ఊళ్లో ఉపాధి లేక నిరుద్యోగం పెరిగిపోయింది. ఎన్నో కుటుంబాలకు పూట గడవడమే గగనమైంది. చ‌దువుకుని వ్యవసాయం చేయలేక కొంద‌రు, ఉద్యోగాలు భర్తీ లేక దిక్కుతోచని అయోమయ పరిస్థితిలో కొంద‌రు ఉన్నారు. అయితే వీరంద‌రికీ గుడ్ న్యూస్‌.. ఎందుకంటే భారతదేశంలో విస్తరిస్తున్న కొత్త రంగాలు మరిన్ని ఉద్యోగావకాశాలను సృష్టిస్తున్నాయి.

 

ఇక తాజ‌గా న్యూఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో డిప్లొమా అర్హత, తగిన అనుభవం ఉన్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  ఈ దరఖాస్తుల ప్రక్రియ గడువు డిసెంబరు 21న ముగియనుంది.  పోస్టుల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


  
జూనియర్ ఇంజినీర్ (సివిల్)- 40 పోస్టులు
విద్యార్హత- డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్), సివిల్ కన్‌స్ట్రక్షన్ విభాగాల్లో మూడేళ్ల అనుభవం ఉండాలి. 
నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. 
వయోపరిమితి- 07.12.2019 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. 

 

దరఖాస్తు.. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకుని దాన్ని నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పోస్ట్ చేయాలి.
ఎంపిక.. రాతపరీక్ష నిర్వహిస్తారు 
చివరితేది: 21.12.2019

 

దరఖాస్తులు.. అభ్యర్థులు దరఖాస్తులు నింపి నిర్ణీత గడువులోగా చేరేలా పంపాలి.
 పంపాల్సిన చిరునామా..
Career Cell, HR Department, 
National capital Region Transport Corporation, 
7/6 siri Fort Institutional Area, 
August kranti Marg, 
New Delhi-110049. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: