కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలకి పోటీ పడే వారు అత్యధికంగా మొగ్గు చూపించే ఉద్యోగాలు రైల్వే ఉద్యోగాలు. ఎంతో మంది పోటీ పరీక్షలకి సిద్ధమయ్యే వారు అత్యధిక బాగం రైల్వే ఉద్యోగాలనే ఎంపిక చేసుకుంటున్నట్లుగా ఓ సర్వేలో కూడా తేలింది. 10th మొదలు ఇంటర్, డిగ్రీ మరిన్ని  ఉన్నతన చదువుల అర్హతలతో ఎప్పడికప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేసే రైల్వే శాఖ తాజాగా మరొక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచీ విడుదల అయిన ఈ నోటిఫికేషన్ స్పోర్ట్స్  కోటా ద్వారా భర్తీ కానున్నట్టు ప్రకటనలో తెలిపింది...నోటిఫికేషన్ పూర్తి వివరాలని  ఒకసారి పరిశీలిస్తే.

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=EAST' target='_blank' title='east-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>east</a> coast railway logo

ఏయే క్రీడలని పరిధిలోకి తీసుకున్నారంటే 

అథ్లెటిక్స్ ,ఆక్వాటిక్స్ బాక్సింగ్ కబడ్డీ ,బ్యాడ్మింటన్ క్రికెట్,హాకీ , వాలీబాల్ ,వెయిట్ లిఫ్టింగ్

 

మొత్తం ఖాళీలు : 21

అర్హతలు : పోస్టులను బట్టి ఇంటర్, డిగ్రీ  పాస్ అయ్యి ఉండాలి, అలాగే క్రీడలలో జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర తరపున ప్రాతినిధ్యం వహించిన వారు అయ్యిఉండాలి.

ఎంపిక విధానం : స్పోర్ట్స్ ట్రయిల్ క్రీడలలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ,విద్యార్హత

దరఖాస్తు విధానం : ఆన్లైన్

దరఖాస్తు చివరితేదీ : 03-01-2020

మరిన్ని వివరాలకోసం : www. rrcbbs.org.in

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: