ప్రతిభ ఉండి దాన్ని చూపించే అవకాశం గాని పాల్గొనే పరిస్థితి గాని లేని కోట్లాది పేద యువకులకు ఇదొక సువర్ణావకాశం అదేమిటంటే  భారతదేశంలో అతిపెద్ద జాతీయ స్థాయిలో తమ  ప్రతిభ ను ఆవిష్కరించడానికి సరికొత్త ప్రయోగాత్మక కార్యక్రమం  యంగ్‌ ఆర్టిస్ట్‌ 2020 ఈ కార్యక్రమంలో వారి ప్రతిభను చూపించడానికి యువత  కోసం టాలెంట్ ఉన్న యువత నుండి  ఆహ్వానిస్తోంది. ఇది జాతీయ స్థాయిలో నిర్వహించే ఒక అద్భుతమైన మ్యూజిక్‌, డ్యాన్స్‌ కాంపిటీషన్‌. భారతదేశంలో చదువుకుంటున్న చిన్నారుల్లో కళల పట్ల ఆసక్తిని పెంపొందించి వారికి రాబోయే రోజుల్లో కళలపై మరింత అవగాహన, ఆసక్తి పెంపొందించేలా చేయడమే ఈ కాంపిటిషన్ లక్ష్యం.

ఈ కార్యక్రమంలో ప్రతిభావంతులైన కళాకారులూ మరియు ప్రఖ్యాత కళాకారుల సమక్షంలో మరియు వారి  మార్గనిర్దేశకత్వంలో ఈ కాంపీటీషన్‌ నిర్వహిస్తారు.ఈ కాంపిటీషన్‌లో 20 వేర్వేరు విభాగాలలోని ఫైనల్ వరకు చేరుకున్న కళాకారులకు  100 స్కాలర్‌షిప్‌లను అందజేయడం ద్వారా యువ ప్రతిభను గుర్తించే ప్రయత్నం జరుగుతుంది. అంతేకాకుండా దేశంలోని విద్యార్థులకు మనకు వారసత్వంగా వచ్చిన కళల పట్ల ఆసక్తి, అవగాహన కలిగించే ప్రయత్నం ఈ కాంపిటీషన్‌ ద్వారా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో, సంగీతం,  డ్యాన్స్ లాంటి  వివిధ 20 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు ఇందులో గెలిచినా యువకులకు  దాదాపు రూ.25 లక్షల విలువైన స్కాలర్‌షిప్‌లు ఈ కాంపిటీషన్‌ ద్వారా  అందించడం జరుగుతుంది. ఈ కాంపిటీషన్‌లో మొత్తం 20 కేటగిరీలు ఉన్నాయి. ఇందులో ఇండియన్‌ క్లాసికల్‌ కేటగిరీలో కర్నాటక సంగీతం , హిందుస్తానీ వోకల్స్‌, తబలా, మృదంగం, ఫ్లూట్‌, సితార్‌, సరోద్‌, వయోలిన్‌, భరతనాట్యం, ఒడిస్సీ, కథక్‌ ఉన్నాయి అలాగే  సమకాలీన కేటగిరీ విషయానికి వస్తే ఇండియన్‌ మరియు వెస్ట్రన్‌ వోకల్స్‌, పియానో, కీబోర్డ్‌, గిటార్‌, డ్రమ్స్‌, వెస్ట్రన్‌ వయోలిన్‌, బ్యాలెట్‌, హిప్‌ హాప్‌, బాలీవుడ్‌, కాంటెంపరరీ డ్యాన్స్ ఉన్నాయి. ఈ కాంపిటీషన్ లో  రిజిస్టర్ చేసుకున్న లక్షలాది యువకులకు ముందుగా  ప్రాథమిక  ఆడిషన్ ఉంటుంది.

ఇక్కడ పాల్గొనేవారు వారు వారి ప్రతిభకు సంబందించిన వీడియోలను అప్‌లోడ్ చేసి నమోదు చేసుకోవచ్చు ఆ తర్వాత అధునాతన థీమ్-ఆధారిత రౌండ్ ఉంటుంది ఈ విదంగా సెలెక్ట్ చేసిన కళాకారులకు 2020 ఆగస్టులో బెంగళూరులో జరగనున్న గ్రాండ్ యంగ్ ఆర్టిస్ట్ ఫెస్టివల్‌లో 100 మంది యువ కళాకారుల వేడుకను జాతీయ వేదికపై ప్రముఖ నటుల మరియు ప్రఖ్యాత కళాకారుల మరియు  జ్యూరీ సభ్యుల సమక్షంలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన అభ్యర్థులు మరింత సమాచారం కోసం కింద ఇవ్వబడిన ఈ-మెయిల్‌‌ ద్వారా సంప్రదించండి: శ్రేయ ఆర్‌ షా: Shreya.Shah@genesis-bcw.com లావణ్యా రంగరాజన్‌: lavanya.rangarajan@genesis-bcw.com

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: