ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షల తేదీ రానే వచ్చేశాయి. గ్రూప్‌-1 ప్ర‌ధాన ప‌రీక్ష‌లు ఫిబ్ర‌వ‌రి 4 నుంచి జ‌రుగుతాయ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(ఏపీపీఎస్సీ) ప్ర‌కటించింది. అలాగే గ్రూప్-1తో పాటు ప‌లు పోస్టుల ప్ర‌ధాన ప‌రీక్ష‌ల షేడ్యూల్‌ను పొడిగిస్తూక‌మిష‌న్ సంముక్ష కార్య‌ద‌ర్శి శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 4 నుంచి 16 వ‌ర‌కు 7 సెష‌న్స్‌లో గ్రూప్‌-1 ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఫిబ్రవరి 4న తెలుగులో పేపర్‌ (క్వాలిఫైయింగ్‌ ఎగ్జామ్‌), 5న ఇంగ్లీషులో పేపర్‌(క్వాలిఫైయింగ్‌ ఎగ్జామ్‌), 7న పేపర్‌-1, 10న పేపర్‌-2, 12న పేపర్‌-3, 14న పేపర్‌-4, 16న పేపర్‌-5 పరీక్షలు జరుగుతాయి. ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌(నో. నెం.10/2018) మెయిన్స్‌ పరీక్షలు మార్చి 17 నుంచి 19వ తేదీ వరకు ఐదు సెషన్లలో జరుగుతాయి. 

 

డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(నో.నెం.20/2018) మెయిన్స్‌ పరీక్షలు మార్చి 19, 20 తేదీల్లో మూడు సెషన్లలో నిర్వహిస్తారు. అలాగే వీటితో పాటు ప‌లు పోస్టుల ప‌రీక్ష‌ల‌ను 2020లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. వీటిలో.. జూనియర్ లెక్చరర్స్- ఫ‌బ్ర‌వ‌రి 17 నుంచి 20 వ‌ర‌కు,   పాలిటెక్నిక్ లెక్చరర్స్- మార్చి 12 నుంచి15 వ‌ర‌కు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్-మార్చి 17,18, డివిజనల్ అకౌంట్‌ ఆఫీసర్- మార్చి 19, 20, డిగ్రీ లెక్చరర్స్- మార్చి 21, 22, టెక్నికల్ అసిస్టెంట్(ఎపి గ్రౌండ్ వాటర్ స‌బ్ సర్వీస్) జియో ఫిజిక్స్- 27, 29, టెక్నికల్ అసిస్టెంట్‌(ఎపి గ్రౌండ్ వాటర్ స‌బ్ స‌ర్వీస్‌) హైడ్రాలజీ- 27, 29న, వెల్ఫేర్ ఆర్గనైజర్ ఎపి సైనిక్ వెల్ఫేర్- మార్చి 28, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్స్‌ సైనిక్ వెల్ఫేర్- మార్చి 28, 29 జ‌ర‌గ‌నున్నాయి.

 

అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఆర్కియాలాజీ, మ్యూజియం- మార్చి 28, 29, టెక్నికల్ అసిస్టెంట్ ఎపి మైన్స్ జియాలాజీ- మార్చి 29, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్- మార్చి 29, అసిస్టెంట్ బిసి/ సోషల్/ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్‌- ఏప్రియ‌ల్ 15, 16, రాయల్టీ ఇన్‌స్పెక్టర్ ఎపి మైనింగ్- ఏప్రియ‌ల్ 16, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్‌- ఏప్రియ‌ల్‌17, టెక్నికల్ అసిస్టెంట్‌(ఆటోమొబైల్ ఇంజనీరింగ్)- ఏప్రియ‌ల్ 17, ఎపి పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎపి టౌన్, కంట్రీ ప్లానింగ్- ఏప్రియ‌ల్ 17, 18, అసిస్టెంట్ కెమిస్ట్‌ గ్రౌండ్ వాటర్- ఏప్రియ‌ల్ 17, 18,  టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఎపి టౌన్, కంట్రీ ప్లానింగ్- ఏప్రియ‌ల్ 17, 18న జ‌ర‌గ‌నున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: