ఐదు భాషలతో కూడిన  హైదరాబాద్ బుక్ ఫెయిర్ ద్వారా దాదాపుగా 330 బుక్ స్టాళ్ల  సోమవారం నుంచి శుక్రవారం వరకు అందుబాటులోకి వచ్చాయి. ఈ పుస్తక ప్రదర్శన మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు.. ఆదివారం, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రియులకు విఘ్ఙానాన్నిఅందించనున్నాయి. ఎన్టీఆర్ స్టేడియం (తెలంగాణ కళాభారతి) వేదికగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్సన సోమవారం గవర్నర్ తమిళిసై సౌందర్  చేతుల మీద మొదలవుతుంది. ప్రవేశ రుసుం రూ.10గా నిర్ణయించామని, విద్యార్థులు, జర్నలిస్టులకు ఉచిత ప్రవేశ మని చెప్పారు. పుస్తకాలు కొన్నవారికి మొక్కలను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించినట్టు గ్రీన్ కోఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిశోర్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జ్ఞాన తెలంగాణ నిర్మాణంలో భాగంగా 33వ జాతీయ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నామని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఆదివారం పుస్తక ప్రదర్శన ఏర్పాట్లను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం నుంచి జనవరి 1 వరకు ప్రదర్శన కొనసాగుతుందని, దీనికి పదిలక్షలమంది వస్తారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో గౌరవ అతిథులుగా గంటా చక్రపాణి, బి.వినోద్‌ కుమార్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ జనార్ధన్‌ రెడ్డి పాల్గొననున్నారు.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సాహిత్యసేవకు గుర్తుగా ఆయన పేరుతో ప్రాంగణం ఏర్పాటుచేశామని, ప్రధాన వేదికకు నోముల సత్యనారాయణ, పుస్తకావిష్కరణల వేదికకు సీ రాఘవాచారి పేర్లు పెట్టామని, మాదిరెడ్డి సులోచన ద్వారం, అబ్బూరి ఛాయాదేవి ద్వారాలను ఏర్పాటుచేశామని చెప్పారు. ఈ సమావేశంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి చంద్రమోహన్, నిర్వాహకులు కోయ చంద్రమోహన్, బ్రహ్మం, శోభన్, ఖయ్యూం, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: