హైదరాబాద్ లోని ఎన్‌.ఎఫ్.సి. సంస్థ భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది భారత ప్రభుత్వ రంగ సంస్థ. అందుకే ఈ ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువ. భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్.. ఎన్‌ఎఫ్‌సీ కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 

మొత్తం 273 ఖాళీలు ఉన్నాయి. ఇందులో స్టైపెండరీ ట్రెయినీ-241, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌-12, వర్క్‌ అసిస్టెంట్‌-20 పోస్టులు ఉన్నాయి. మెకానికల్‌, కెమికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, ఆర్కిటెక్చర్‌, ఆటోమొబైల్‌, తదితర విభాగాల్లో ఈ ఖాలీలు ఉన్నాయి.

 

వీటికి అర్హత ఏంటంటే.. పోస్టుని అనుసరించి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పోస్టును బట్టి తమ అర్హతను అభ్యర్థులు పరిశీలించుకోవాలి.

 

ప్రిలిమినరీ టెస్ట్‌, అడ్వాన్స్‌ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు చివరితేది: జనవరి 10, 2020. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు..  https://www.nfc.gov.in/ వెబ్ సైట్ ను పరిశీలించుకోవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: