జిప్ మర్.. వైద్యరంగంలో పేరెన్నికగన్న సంస్థ. ఇది పుదుచ్చేరిలో ఉంది. ఇది భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇందులో అనేక విభాగాల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడింది.

 

ఇంతకూ జిప్ మర్ అంటే ఏంటంటారా.. జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టుగ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌(జిప్‌మర్‌) అన్నమాట. ఈ సంస్థలో 162 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 

ఏమేం ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయంటే.. నర్సింగ్‌ ఆఫీసర్‌, మెడికల్‌ సోషల్‌ వర్కర్‌, జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌, ఎలక్ట్రికల్‌), స్టెనోగ్రాఫర్‌ వంటి పోస్టులు ఉన్నాయి.

                         

రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 23 ప్రారంభమవుతుంది. జనవరి 27, 2020 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం https://www.jipmer.edu.in/ చూడవచ్చు.

 

నెట్లో నోటిఫికేషన్ ను ఆమూలాగ్రం  పరిశీలించుకుని.. మీకు తగిన అర్హతలు ఉన్నట్టయితే అప్లయ్ చేసుకోండి. సరిగ్గా ప్రిపేరైతే.. ఉద్యోగం మీకే. తక్కువ పోస్టులు కదా అని నిరుత్సాహం వద్దు. తక్కువ పోస్టులు ఉన్నప్పుడు చాలా మంది అప్లయ్ చేయరు. ఇది మీకు లాభించవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: