తెలుగు ఉపాధ్యాయులు సత్తా చాటారు. ఢిల్లీ స్థాయిలో అవార్డులు గెలుచుకున్నారు. పాఠశాల విద్యా బోధనలో సాంకేతిక సమాచారంతో డిజిటలైజేషన్ లో విశిష్ఠ ప్రతిభ చూపుతున్న ఉపాధ్యాయులకు  ఇచ్చే జాతీయ పురస్కారాలు అందుకున్నారు. వీటిని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అందిస్తుంది.

 

ఉపాధ్యాయుల జాతీయ ఐసీటీ అవార్డుల ను 2017 ఏడాదికి గానూ ఆంధ్రప్రదేశ్ నుంచి కదిరి పాఠశాలకి చెందిన వజ్ర నర్సింహారెడ్డి దక్కించుకున్నారు. ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషన్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి సంజయ్ ధోత్రే చేతుల మీదుగా నర్సింహారెడ్డి జాతీయ పురస్కారం అందుకున్నారు. 

 

దేశంలో మొత్తం 43 మంది అవార్డులకు ఎంపిక కాగా.. అందులో ఏపీ నుంచి ఒక్కరు, తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. పాఠశాల విద్యా బోధనలో సాంకేతిక సహాకరం ఎలా ఉపయోగపడుతుందన్న అంశాలపై యాప్స్ పై దృష్టి పెట్టినట్లు నర్సింహారెడ్డి తెలిపారు. డిజిటల్ ప్రపంచంలో సాంకేతికత సాయంతో పాఠాలు చెబితేనే విద్యార్థులకు అవగాహన చేసుకునేందుకు సులభం అవుతుందని ఆయన అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: