ఇంటర్ పాసైన వారి కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగా అవకాశాలు కల్పిస్తూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్- SSC ఇటీవల కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ CHSL (10+2) ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక  ఉద్యోగాలకు దరఖాస్తు చేసే విషయంలో చాలా మంది అభ్యర్థులకు కొన్ని సందేహాలు ఉంటాయి. ఇలాంటి వారి కోసం దరఖాస్తు  చేసుకునే తప్పుడు ఎలాంటి జాగ్రతలు, స్టెప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందామా మరి....

 

ముందుగా మీరు విషయం తెలుసుకోవాలి..  ఈ ఉద్యోగాలలో కాంపిటీటీవ్ ఎగ్జామ్ ద్వారా లోయర్ డివిజనల్ క్లర్క్, పోస్టల్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కేంద్ర ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు, సంస్థల్లో  ఉన్నాయి అని నోటిఫికేషన్ తెలియచేస్తుంది. ప్రస్తుతం అన్ని పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలు అవ్వడం కూడా జరిగింది. ఇక దరఖాస్తు చేసు కోవడానికి  2020 జనవరి 12 చివరి తేదీ అని తెలియచేయడం జరిగింది. మరి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందామా మరి...

 

ఇక మీరు ముందుగా  కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ పరీక్షకు  దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్‌తో పాటు ఇన్‌స్ట్రక్షన్స్ కూడా పూర్తిగా చదవం చాల మంచిది. అలాగే తగిన అర్హతలు ఉన్నాయో లేదో చూసుకోండి. ఇక మీకు  ఓటీపీ కోసం మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ తప్పనిసరిగా ఉండాలి.

 
ఇక దరఖాస్తు చేసుకోవడాయినికి ఈ డాకుమెంట్స్ కచ్చితంగా కావాలి. వాటి వివరాలు ఇలా... ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, స్కూల్ లేదా కాలేజీ ఐడీ లాంటి ఐడీ ప్రూఫ్స్ కచ్చితంగా అవసరం పడుతుంది. ఇందుకు కచ్చితంగా 10వ తరగతి రోల్‌నెంబర్ ఉండాలి. ఇక  స్కాన్ చేసిన మీ కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, స్కాన్ చేసిన సంతకం కూడా ఉండాలి.

 

ఇక  దరఖాస్తు చేసుకునే సమయంలో  ఈ స్టెప్స్ ఫాలో అవుతే చాల సులువుగా అప్లై చేసుకోవచ్చు. మరి స్టెప్స్  చూద్దామా మరి..  మొదట స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ఓపెన్ చేయాలి. మీ వివరాలతో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక  లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో అప్లై ట్యాబ్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత CHSL ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. ఇక అక్కడ Combined Higher Secondary (10+2) Level Examination, 2019 పక్కన Apply పైన క్లిక్ చేయాలి. 

 

ఇక ఇలా చేసిన తర్వాత పేజీలో మీ ఆధార్ నెంబర్, ఐడీ ప్రూఫ్ నెంబర్, మీ పేరు, తండ్రి పేరు, తల్లిపేరు, పుట్టిన తేదీ, 10వ తరగతి రోల్ నెంబర్, జెండర్, ఎడ్యుకేషన్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. 

 

ఇక ఆ తర్వాత ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత  ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తు పూర్తైన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. ఇక ఎందుకు ఆలస్యం అర్హత చెక్ చేసుకుని  అప్లై చేసుకోండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: