ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారా? ఏదో ఉద్యోగం కోసం కన్సల్టెన్సీలను సంప్రదిస్తూ వేలకు వేలు సమర్పించుకుంటున్నారా..?  నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండ‌డంతో.. చదువు పూర్తయిన తర్వాత ఎక్కువ కాలం ఉద్యోగం లేక పోవుడంతో అనేక మంది యువకులు ఆత్మన్యూనతా భావానికి గుర‌వుతున్నారు. అయితే ఉద్యోగాలు లేక క‌ష్టాలు ప‌డుతున్న వారంద‌రికి గుడ్ న్యూస్‌. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్-NABARD ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఆఫీస్ అటెండెంట్ పోస్టుల్ని భర్తీ చేయనుంది.

 

అలాగే మ‌రో విష‌యం ఏంటంటే.. పదవ తరగతి పాసైతే చాలు. మొత్తం 73 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. 2020 జనవరి 12 లోగా దరఖాస్తు చేయాలి. 10వ తరగతి పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, లాంగ్వేజీ ప్రొఫీషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.nabard.org/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

 

నోటిఫికేషన్ వివరాలు: 

మొత్తం ఖాళీలు- 73
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 25
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 12
ఆన్‌లైన్ ఫీజ్ పేమెంట్- 2019 డిసెంబర్ 25 నుంచి 2020 జనవరి 12

 

దరఖాస్తులు ఎడిట్ చేయడానికి చివరి తేదీ- 2020 జనవరి 12దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- చివరి తేదీ- 2020 జనవరి 27
విద్యార్హత- 2019 డిసెంబర్ 1 నాటికి 10వ తరగతి పాస్ కావాలి. డిగ్రీ కన్నా ఎక్కువ చదివినవారు దరఖాస్తు చేయకూడదు.
వయస్సు- 2019 డిసెంబర్ 1 నాటికి 18 నుంచి 30 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: