పీహెచ్ డీ.. ఇది పూర్తి చేస్తే ఎంతో గుర్తింపు ఉంటుంది. అధ్యాపకవృత్తిలోనూ పీ హెచ్ డీ కి చాలా విలువ ఉంటుంది. పరిశోధనారంగంలో పీహెచ్ డీ చేసిన వారికి చాలా అవకాశాలు ఉంటాయి. అంతే కాదు.. ఈ కోర్సు చేసినవారికి విద్యాపరంగా మేధావిగా మంచి గౌరవమూ దక్కుతుంది. అయితే ఈ పీహెచ్ డీ విషయంలో తాజాగా యూజీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

 

అదేంటంటే..  పీహెచ్‌డీ చేయాలనుకునే ప్రతి విద్యార్థి కొన్ని కోర్సులు తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ తప్పనిసరిగా చదవాల్సిన కోర్సుల్లో మరో రెండింటిని చేర్చింది. విద్యార్థులకు తమ పరిశోధనల ప్రచురణపై మరింత అవగాహన పెంచేలా 'పబ్లికేషన్‌ ఎథిక్స్‌', 'పబ్లికేషన్‌ మిస్‌కండక్ట్‌' అనే కొత్త కోర్సులను యూజీసీ  ప్రవేశపెట్టింది.

 

తాజాగా ఇటీవల జరిగిన యూజీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. విద్యార్థులు తమ పరిశోధనాంశాన్ని దరఖాస్తు చేసుకోవడానికి ఈ రెండు కోర్సులు ఇకపై తప్పనిసరి. వచ్చే ఎకడమిక్ ఇయర్ నుంచే ఈ నిబంధనని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అన్ని విశ్వవిద్యాలయాలకు యూజీసీ లేఖ కూడా రాసేసింది. ఇప్పటికే సబ్జెక్టుతో సంబంధం లేకుండా పీహెచ్‌డీ చేసే విద్యార్థులంతా 'రీసెర్చి మెథడాలజీ' అనే కోర్సు తప్పనిసరి. ఇప్పుడు మరో రెండు అదనంగా చేరాయన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: