నిరుద్యోగులకు ఈ మధ్యకాలంలో శుభవార్త మీద శుభవార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాలు కేంద్రంలో ఉద్యోగాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ నోటిఫికేషన్ పడి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతున్నాయి. అయితే తాజాగా నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. కొద్ది రోజుల క్రితం 926 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆర్‌బీఐ ఓ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోనూ ఖాళీలు ప్రకటించింది.

 

అయితే తాజాగా వీటితో పాటు ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది ఆర్‌బీఐ.  పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించింది. డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు డిసెంబరు 30 నుంచి జనవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మొత్తం 17 పోస్టులున్నాయి. వాటి వివ‌రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

పోస్టుల వివరాలు:

 

మొత్తం ఖాళీలు- 17

 

లీగల్ ఆఫీసర్ గ్రేడ్ బీ- 1

 

మేనేజర్ (టెక్నికల్)- 2

 

అసిస్టెంట్ మేనేజర్ (రాజ్‌భాష)- 8

 

అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ)- 5లైబ్రరీ ప్రొఫెషనల్స్- 1

 

అర్హత- పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు.

 

వయోపరిమితి- 01.12.2019 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.12.1989 - 01.12.1998 మధ్య జన్మించి ఉండాలి.

 

bank OF INDIA' target='_blank' title='rbi-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>rbi Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు:

 

నోటిఫికేషన్ రిలీజ్- 2019 డిసెంబర్ 27

 

దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 30

 

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 20

 

ఎగ్జామ్- 2020 ఫిబ్రవరి 15

 

దరఖాస్తు ఫీజు- రూ.600. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100

 

ద‌ర‌ఖాస్తు విధానం: సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

 

ఎంపిక విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ (డిస్క్రిప్టివ్) పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

మరింత సమాచారం తెలుసుకోండి: