నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతూనే ఉన్నాయి. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్-VSSC కోసం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 72 ఖాళీలను ప్రకటించింది ఇస్రో. ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది ఇస్రో. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ అధికారిక వెబ్‌సైట్ వెబ్‌సైట్‌లో కెరీర్ సెక్షన్‌లో చూడొచ్చు.

 

అయితే దరఖాస్తు చేసుకోవ‌డానికి మ‌రో రెండు రోజులు మాత్రమే గ‌డువు ఉంది. సో.. వెంట‌నే అర్హులు ద‌ర‌ఖాస్తు చేసుకోండి. ఇక పోస్టుల వివ‌రాల విష‌యానికి వ‌స్తే.. మొత్తం ఖాళీలు- 72. అందుతో ఫిట్టర్- 24, ఎలక్ట్రానిక్ మెకానిక్- 20, మెషినిస్ట్- 3, మెకానిక్ మోటార్ వెహికిల్ / మెకానిక్ డీజిల్- 3కెమికల్ ఆపరేటర్- 2, టర్నర్- 2, ఎంఆర్ & ఏసీ- 2, ఎలక్ట్రీషియన్- 2, వెల్డర్- 1, ఫిట్టర్ కమ్ ఇండస్ట్రియల్ రేడియోగ్రాఫర్- 1, ఫోటోగ్రఫీ- 1, బ్లాక్‌స్మితీ / ఫోర్జర్ & హీట్ ట్రీటర్- 1, కెమికల్ ఆపరేటర్ (మెయింటనెన్స్ మెకానిక్)- 1, బాయిలర్ అటెండెంట్- 1, మెకానికల్- 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

 

ఇక గుర్తుంచుకోవాల్సిన అంశాలు:

 

వయస్సు- 2019 డిసెంబర్ 30 నాటికి 18 ఏళ్లు నుంచి 35 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

 

దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజులో మినహాయింపు.

 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 16 ఉదయం 10 గంటలు

 

దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 30 సాయంత్రం 5 గంటలు

మరింత సమాచారం తెలుసుకోండి: