స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్-CGL 2018 పరీక్ష రాసినవారికి శుభవార్త.  కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ - 2018 ఖాళీల వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ డిసెంబరు 27న వెల్లడించింది. వెబ్‌సైట్‌లో ఖాళీల వివరాలను అందుబాటులో ఉంచింది. గతంలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి ఖాళీలను వరుసగా ప్రకటిస్తోంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. కొద్ది రోజుల క్రితం కొద్ది రోజుల క్రితమే 'ఢిల్లీ పోలీస్‌, సీఏపీఎఫ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్, సీఐఎస్ఎఫ్‌లో ఏఎస్ఐ ఎగ్జామినేషన్ 2018' నోటిఫికేషన్‌‌లో 1,578 ఎస్ఐ పోస్టుల్ని, 'సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్ ఎగ్జామినేషన్ 2019' నోటిఫికేషన్‌లో 2475 పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్టు ప్రకటించింది. 

 

ఇక ఇప్పుడు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్-CGL 2018 నోటిఫికేషన్‌లో 11,271 పోస్టుల్ని ప్రకటించింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో సీజీఎల్ఈ ద్వారా భర్తీ చేసే పోస్టుల సంఖ్య గ్రూప్-ఎ, గ్రూప్-బి, గ్రూప్-సి, గ్రూప్-డి పరిధిలో మొత్తం 11,271 ఉన్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. వీటిలో గ్రూప్-ఎ పరిధిలో 300 పోస్టులు; గ్రూప్-బి పరిధిలో 3,778 పోస్టులు; గ్రూప్-సి పరిధిలో 274 పోస్టులు ఉండగా.. గ్రూప్-డి పరిధిలో 6,919 పోస్టులు ఉన్నాయి.

 

అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించిన మొత్తం ఖాళీల్లో అత్యధికంగా కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ విభాగంలో 3,082 ఆడిటర్ పోస్టులు ఉన్నాయి. రెండో స్థానంలో ఇన్‌స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్) పోస్టులు 1,729 ఉన్నాయి. ఇక  ప్రస్తుతం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్-CGL 2018 నియామక ప్రక్రియ కొనసాగుతోంది. డిసెంబర్ 29న ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన టియర్ 3 (మూడో దశ) పరీక్ష జరగనుంది. మొదటి, రెండో, మూడో దశ పరీక్షల మార్కుల ఆధారంగా చివరి మెరిట్ లిస్ట్ సిద్ధమవుతుంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: