ఉన్న‌త చ‌దువులు అభ్యసించి ఉద్యోగాలు లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న యువ‌త ఎంద‌రో ఉన్నారు. అయితే అలాంటి వారందిరికీ గుడ్ న్యూస్‌. ఇటీవ‌ల పలు విభాగాల్లో మొత్తం 37 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రొఫీషియెన్సీ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఇక తాజాగా oil CORPORATION' target='_blank' title='ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మార్కెటింగ్ విభాగం టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2020 జనవరి 21 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

 

ఖాళీల వివ‌రాలు:

టెక్నీషియన్ & ట్రేడ్ అప్రెంటిస్: 312 పోస్టులు

 

డిప్లొమా విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్.

 

ఐటీఐ ట్రేడ్లు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్.

 

అర్హత: టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు 50 శాతం మార్కులతో డిప్లొమా (ఇంజినీరింగ్), ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హత ఉండాలి. ఇంజినీరింగ్ డిగ్రీ, లా డిగ్రీ, పీజీ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

 

వ‌యో ప‌రిమితి: 30.11.2019 నాటికి 18-24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

 

ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా.

 

ముఖ్య తేదీలు:


- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.12.2020

 

- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.01.2020

 

- అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: 28.01.2020

 

- రాతపరీక్ష తేది: 02.02.2020

మరింత సమాచారం తెలుసుకోండి: