టెలికాం రంగంలో తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని ఏర్పరుచుకున్న సంస్థ రిలయన్స్ జియో. ఇప్పటికే, ఆ సంస్థ వారు ఎన్నో వేల మందికి ఉపాధిని కల్పించారు. ఇంకా కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో తాజాగా, careers.jio.com వెబ్ సైట్ ద్వారా ఓ జాబ్ ప్రకటన కూడా విడుదల చేసారు. డిగ్రీ, పీజీ చదువుకున్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అనుభవం ఉన్న వారిని, ఫ్రెషర్స్ ను కూడా జియో సంస్థ ఆహ్వానిస్తుంది. అర్హతలు కలిగివున్న ఆసక్తిగలవారు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


వివిధ భాగాల కింద భర్తీ చేయబోయే జాబ్స్ ఇవే... జియో పాయింట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సేల్స్ ఆఫీసర్, సీనియర్ ఎంటర్‌ప్రైజ్ సేల్స్ ఆఫీసర్, డేటా ఇంజినీర్, డెవలపర్ అప్లికేషన్ ఇంజినీర్, బ్యాకెండ్ డెవలపర్.

పైన పేర్కొన్న ఉద్యోగాలకు బీఈ/బీటెక్, బీకామ్, బీఎస్సీ, బీసీఏ ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, డిప్లొమా పూర్తిచేసిన వారు అర్హులు.

ఉద్యోగాలకు కావాల్సిన స్కిల్స్:-

కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఆంగ్ల బాషా లో చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లను, ఐ ఫోన్ లను వాడటం తెలిసుండాలి. ఏ ప్రాంతంలో మీరు జాబ్ కు దరఖాస్తు చేస్తున్నారో ఆ ప్రాంత స్థానిక భాషపై పట్టు ఉండాలి. అందరితో కలిసిపోయే కమ్యూనికేషన్స్ స్కిల్స్ తప్పనిసరి.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి సంస్థ రూల్స్ అండ్ కండిషన్స్ ను బట్టి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటుంది జియో. అయితే, జాబ్ కి అప్లై చేసినందుకు మీరు ఎటువంటి ఫీజ్ కట్టాల్సిన అవసరం లేదు. మరిన్ని వివరాలకు Careers.jio.com వెబ్ సైట్ ను ఒక్కసారి విజిట్ చేయండి.




మరింత సమాచారం తెలుసుకోండి: